నేను ఇంకా రాజీనామా చేయలేదు.. ఆకుల సత్యానారాయణ

Published : Jan 07, 2019, 12:48 PM IST
నేను ఇంకా రాజీనామా చేయలేదు.. ఆకుల సత్యానారాయణ

సారాంశం

బీజేపీ సీనియర్ నేత, రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ పార్టీకి రాజీనామా చేశారని.. త్వరలో జనసేనలో చేరబోతున్నారంటూ సోమవారం ఉదయం వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే.

బీజేపీ సీనియర్ నేత, రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ పార్టీకి రాజీనామా చేశారని.. త్వరలో జనసేనలో చేరబోతున్నారంటూ సోమవారం ఉదయం వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ వార్తలపై ఎమ్మెల్యే ఆకుల సత్యానారాయణ స్పందించారు.

తాను ఇంకా బీజేపీ కి రాజీనామా చేయలేదని స్పష్టం చేశారు. అయితే.. రాజీనామా చేయాలనే యోచనలో మాత్రం ఉన్నట్లు తెలిపారు. తాను ప్రస్తుతం బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాని కలిసేందుకు ఢిల్లీ వచ్చినట్లు చెప్పారు. అయితే.. ఇప్పటి వరకు తనకు అమిత్ షా అపాయింట్ మెంట్ దొరకలేదని తెలిపారు. అమిత్ షా ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో ఉన్నట్లు వివరించారు. ఆయనతో చర్చించిన తర్వాతే.. తన రాజీనామా  చేయాలా వద్దా అన్న విషయంపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. ఒకవేళ రాజీనామా చేస్తే.. జనసేనలోనే చేరాతారా అన్న ప్రశ్నకు మాత్రం ఆయన సమాధానం దాటవేసినట్లు సమాచారం.

read more news here

ఏపీలో బీజేపీకి షాక్.. జనసేనలోకి కీలకనేత

PREV
click me!

Recommended Stories

Constable Success Stories:వీళ్ళ ఎమోషనల్ మాటలు చూస్తే కన్నీళ్లు ఆగవు | Police | Asianet News Telugu
Bhumana Karunakar Reddy: దేవుడ్ని దోచి, ఒబెరాయ్ కు కట్టబెడుతున్న బాబు ప్రభుత్వం| Asianet News Telugu