సుధాకర్ ఆత్మహత్యపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

Published : Jul 28, 2018, 12:51 PM ISTUpdated : Jul 30, 2018, 12:16 PM IST
సుధాకర్ ఆత్మహత్యపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

సారాంశం

ప్రత్యేక హోదా కోసం తొందరపడి ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని, అందరం కలిసి పోరాడి సాధించుకుందామని ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

పెద్దాపురం : ప్రత్యేక హోదా కోసం తొందరపడి ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని, అందరం కలిసి పోరాడి సాధించుకుందామని ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. చిత్తురు జిల్లా మదనపల్లిలో చేనేత కార్మికుడు సుధాకర్‌ ఆత్మహత్యపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆయన  తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. సుధాకర్‌ ఆత్మహత్య విషయం గురించి తెలుసుకున్న వైఎస్‌ జగన్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 

ఇలా తొందరపడి తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవద్దని, తల్లి తండ్రులకు శోకాన్ని మిగల్చవద్దని విజ్ఞప్తి చేశారు. బతికుండి పోరాడి సాధించుకుందామని పిలుపునిచ్చారు. సధాకర్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 

ప్రత్యేక హోదా మన హక్కు అని సూసైడ్‌ నోట్‌ రాసి మదనపల్లి చేనేత కార్మికుడు సుధాకర్‌(26) శనివారం ఉదయం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే