బొత్సకు మొండిచేయి: షాకిచ్చిన జగన్

By narsimha lodeFirst Published Oct 2, 2018, 5:53 PM IST
Highlights


విజయనగరం: విజయనగరం జిల్లాలో ప్రజా సంకల్పయాత్ర సందర్భంగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ షాకిచ్చారు.


విజయనగరం: విజయనగరం జిల్లాలో ప్రజా సంకల్పయాత్ర సందర్భంగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ షాకిచ్చారు.  తనకు ప్రత్యర్థిగా ఉన్న ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామికి జగన్ విజయనగరం అసెంబ్లీ టిక్కెట్టును కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో బొత్స వర్గీయులకు ఈ పరిణామం అసంతృప్తిని కల్గిస్తోంది.

విజయనగరం అసెంబ్లీ స్థానం నుండి 2004లో స్వతంత్ర అభ్యర్ధిగా విజయం సాధించిన  కోలగట్ల వీరభద్రస్వామి ఆ తర్వాత పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత ఆయన  కాంగ్రెస్ ‌కు గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు.

ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. విజయనగరం అసెంబ్లీ సెగ్మెంట్లో కోలగట్ల వీరభద్రస్వామి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ సోమవారం సాయంత్రం విజయనగరం జిల్లా కేంద్రంలో జరిగిన బహిరంగసభలో ప్రకటించారు.

విజయనగరం అసెంబ్లీ సెగ్మెంట్లో  కోలగట్ల వీరభద్రస్వామికి వ్యతిరేకంగా బొత్స సత్యనారాయణకు చెందిన వర్గం కూడ ఉంది. అవనాపు బ్రదర్స్ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వర్గంగా కొనసాగుతున్నారు.  వైసీపీలో కోలగట్లకు  వ్యతిరేకంగా అవనాపు బ్రదర్స్ ఉన్నారు. విజయనగరం అసెంబ్లీ టిక్కెట్టును అవనాపు బ్రదర్స్  కూడ కోరుకొంటున్నారు. 

అయితే ప్రజాసంకల్పయాత్రలో భాగంగా విజయనగరంలో జిల్లా కేంద్రంలో జరిగిన సభలో  2019 ఎన్నికల్లో విజయనగరం నుండి కోలగట్ల వీరభద్రస్వామికి టిక్కెట్టు కేటాయిస్తున్నట్టు జగన్ ప్రకటించారు. దీంతో కోలగట్ల వర్గీయుల ఆనందానికి అవధుల్లేకుండాపోయింది. బొత్స వర్గీయుల్లో మాత్రం  కోలగట్లకు టిక్కెట్టు కేటాయిస్తానని జగన్ ప్రకటించడంపై  నిరాశ నెలకొంది.
 

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు.. పార్టీ తొలి అభ్యర్థిని ప్రకటించిన జగన్

నా భార్యను సైతం...: జగన్ సంచలన ఆరోపణ

చంద్రబాబు పాలనలో అంతా రివర్స్ గేర్: వైఎస్ జగన్ ధ్వజం

 

click me!