‘దర్శి’ అభ్యర్ధిని ప్రకటించిన జగన్

First Published Mar 4, 2018, 9:57 AM IST
Highlights
  • దర్శి నియోజకవర్గంలో రాజకీయాలకు క్లారిటీ వచ్చింది.

ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో రాజకీయ అనిశ్చితికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెరదించారు. రాబోయే ఎన్నికల్లో ఇక్కడి నుండి మాధవ్ రెడ్డి పోటీ చేస్తారంటూ తాళ్ళూరులో శనివారం జరిగిన బహిరంగసభలో ప్రకటించారు. దాంతో దర్శి నియోజకవర్గంలో రాజకీయాలకు క్లారిటీ వచ్చింది.

మామూలుగా అయితే, మాజీ ఎంఎల్ఏ, జగన్ సన్నిహితుడైన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి దర్శిలో పోటీ చేయాలి. అయితే, వ్యక్తిగత సమస్యల వల్ల తాను పోటీ చేయటం లేదని చెప్పేసారు. తాను రాజకీయాలకు పూర్తి సమయాన్ని కేటాయించేలేనని జగన్ తోనే స్పష్టం చేశారు. పార్టీ ఎవరిని అభ్యర్ధిగా ప్రకటించినా వారి విజయానికి సహకరిస్తానని కూడా మాటిచ్చారు. అంతేకాకుండ మాధవ్ ను బూచేపల్లే ఇన్చార్జిగా పెట్టమని చెప్పారని సమాచారం.

బూచేపల్లి సూచనల మేరకే మాధవ్ ను జగన్ సమన్వయకర్తగా నియమించినా ఉపయోగం కనబడలేదు. ఎందుకంటే, మాధవ్ కు నియోజకవర్గంలోని ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు పెద్దగా సహకారం అందిచటం లేదు. దాంతో పార్టీ కార్యక్రమాల నిర్వహణలో మాధవ్ ఇబ్బందులు పడుతున్నారు. అదే విషయం తాజాగా బూచేపల్లి-జగన్ మధ్య చర్చకు వచ్చిందట.

ఎన్నికలు ముంచుకు వస్తున్న నేపధ్యంలో బూచేపల్లే పోటీ చేయాలంటూ నేతలు, కార్యకర్తలు ఒత్తిడి తెస్తున్నారు. అందుకనే మాధవ్ ఇబ్బందులు పడుతున్నారు. దాంతో నియోజకవర్గంలో పరిస్ధితులను జగన్ పూర్తిగా అధ్యయనం చేశారు. వెంటనే అభ్యర్ధి విషయంలో క్లారిటీ ఇవ్వకపోతే రాబోమయే సమస్యలను గ్రహించిన జగన్ వెంటనే మాధవ్ పేరును బహిరంగ సభలో ప్రకటించి అనిశ్చితికి తెరదించారు.  

click me!