మీరు సంతోషంగా ఉండాలి.. చంద్రబాబుకి జగన్, పవన్ బర్త్ డే విషెస్..!

Published : Apr 20, 2021, 02:59 PM IST
మీరు సంతోషంగా ఉండాలి..  చంద్రబాబుకి జగన్, పవన్ బర్త్ డే విషెస్..!

సారాంశం

ఆ దేవుని ఆశీస్సులతో నిండు ఆరోగ్యంతో మీరు సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నాను. అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. కాగా.. ఆ ట్వీట్ కి చంద్రబాబు నాయుడు స్పందించి.. దన్యావాదాలు తెలియజేశారు.

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. జగన్ తో పాటు.. పవన్ కూడా బర్త్ డే విషెస్ తెలిపారు.

‘‘చంద్రబాబు నాయుడు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. ఆ దేవుని ఆశీస్సులతో నిండు ఆరోగ్యంతో మీరు సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నాను.’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. కాగా.. ఆ ట్వీట్ కి చంద్రబాబు నాయుడు స్పందించి.. దన్యావాదాలు తెలియజేశారు.

 

కాగా.. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్.. చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో, ప్రజా జీవితంలో తనదైన స్థానాన్ని కలిగిన చంద్రబాబునాయుడు గారు ఆయురారోగ్యాలతో ఉండాలని వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను’’ అంటూ పవన్ పేర్కొన్నారు.

కాగా.. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ సైతం చంద్రబాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ ని ఏపీ సీఎం వో ట్వీట్ చేసింది. ప్రజా  జీవితంలో ఆయన జీవితం గడవాలని.. ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

Vegetables Price : వీకెండ్ మార్కెట్స్ లో ఏ కూరగాయ ధర ఎంత..?
IMD Rain Alert : ఈ రెండ్రోజులు వర్ష బీభత్సమే... ఈ ప్రాంతాలకు పొంచివున్న ప్రమాదం