కరోనాతో ఒకే కుటుంబంలో నాలుగు రోజుల వ్యవధిలో నలుగురు మరణించారు. ఈ ఘటన విజయవాడలో చోటు చేసుకొంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించడం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. అంతేకాదు ఈ ఘటనతో స్థానికులు కూడ భయాందోళనలకు గురౌతున్నారు.
విజయవాడ: కరోనాతో ఒకే కుటుంబంలో నాలుగు రోజుల వ్యవధిలో నలుగురు మరణించారు. ఈ ఘటన విజయవాడలో చోటు చేసుకొంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించడం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. అంతేకాదు ఈ ఘటనతో స్థానికులు కూడ భయాందోళనలకు గురౌతున్నారు.
also read:కరోనా పాజిటివ్ : భార్యభర్తల్ని ఇంట్లో పెట్టి తాళం వేసి.. ప్రశ్నిస్తే పాతేస్తామంటూ బెదిరింపులు..
విజయవాడ పట్టణానికి చెందిన న్యాయవాది దినేష్ కుటుంబంలో ఈ ఘటన చోటు చేసుకొంది. కరోనాతో దినేష్ మంగళవారం నాడు మరణించాడు. ఇవాళ తెల్లవారుజామునే దినేష్ తండ్రి చనిపోయాడు. మూడు రోజుల క్రితం దినేష్ తల్లి, బాబాయి కూడ మరణించారు.
ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని నిర్ణయం తీసుకొంది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఏపీ సీఎం వైఎస్ జగన్ సోమవారం నాడు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించకపోతే రూ. 100 జరిమానా విధించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.