జగన్ అనంతపురం పర్యటన: చంద్ర దండు, తెలుగు యువత నేతల అరెస్ట్

Published : Jul 08, 2021, 07:25 PM ISTUpdated : Jul 08, 2021, 07:26 PM IST
జగన్ అనంతపురం పర్యటన: చంద్ర దండు, తెలుగు యువత నేతల అరెస్ట్

సారాంశం

ఏపీ సీఎం వైఎస్ జగన్ జిల్లా పర్యటన నేపథ్యంలో పోలీసులు అనంతపురం జిల్లావ్యాప్తంగా ముందస్తు అరెస్టులు చేశారు. జగన్ పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించిన నేపథ్యంలో ఈ అరెస్టులు జరుగుతున్నాయి.

అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా పర్యటన నేపథ్యంలో పోలీసులు జిల్లావ్యాప్తంగా ముందస్తు అరెస్టులు చేశారు. ప్రభుత్వం విడుదల చేసన జాబ్ క్యాలెండర్ ను విద్యార్థి, యువజన సంఘాలు, తెలుగు యువత వ్యతిరేకిస్తున్నాయి. 

సీఎం జగన్ పర్యటనను అడ్డుకుంటామని ఆ సంఘాల నాయకులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పోలీసులు ముందస్తు అరెస్టులకు దిగారు. అనంతపురంలో నిరసన తెలిపిన చంద్ర దండు, తెలుగు యువత నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. 

అరెస్టులను విద్యార్థి, తెలుగు యువత, చంద్రండు నాయకులు ఖండించారు. ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ మీద యువత నిరసన వ్యక్తం చేస్తూ వస్తోంది. 

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారంనాడు కడప జిల్లాలో పర్యటించారు. పులివెందులలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 

PREV
click me!

Recommended Stories

Road Doctor: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోడ్డు డాక్ట‌ర్‌.. దేశం దృష్టిని ఆక‌ర్షిస్తోన్న స‌రికొత్త సేవ‌లు
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!