జగన్ ప్రభుత్వంపై వ్యాఖ్యలు: పవన్ కల్యాణ్ కు ఆళ్ల రామకృష్ణారెడ్డి చురకలు

Published : Jul 08, 2021, 07:09 PM IST
జగన్ ప్రభుత్వంపై వ్యాఖ్యలు: పవన్ కల్యాణ్ కు ఆళ్ల రామకృష్ణారెడ్డి చురకలు

సారాంశం

జగన్ ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేసిన జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కు వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి చురకలు అంటించారు. వాస్తవాలు తెలుసుకుని పవన్ కల్యాణ్ మాట్లాడాలని ఆర్కె అన్నారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేసే నేతలు వాస్తవాలు తెలుసుకోవాలని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి అన్నారు. పవన్ కల్యాణ్ తన స్థాయిని తగ్గించే విధంగా వ్యాఖ్యలు చేశారని ఆర్కె గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.

బాధితులు ఏ పార్టీవారినైనా కలవడంలో తప్పు లేదని, కానీ పూర్తి స్థాయిలో సమాచారం తెలుసుకుని అవగాహన చేసుకోవాలని ఆయన అన్నారు. తన కోసం ప్రజలను ఇబ్బందులు పెట్టకుండా చూడాలని వైఎస్ జగన్ చెప్పారు కాబట్టే ఇళ్లు తొలగించే ప్రక్రియలో జాప్యం జరిగిందని ఆయన చెప్పారు. 

నిర్వాసితులకు మౌలిక సదుపాయాల కల్పన తర్వాతే ఇళ్ళు తొలగిస్తామని స్పష్టం చేసినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడ చేయనంత అభివృద్ధి ముఖ్యమంత్రి మంగళగిరిలో చేశారని ఆయ.న చెప్పారు. తన కోసం ఆక్రమణలు చేసినవారికి, ఇరిగేషన్ ల్యాండ్ ను తొలగించినవారికి ప్రత్యామ్నాయం చూపిన ఘరత జగన్మోహన్ రెడ్డిదేనని ఆయన చెప్పారు. 

ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు సహజమే కానా చట్టం, అక్కడి వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పూర్తి సమాచారంతో మాట్లాడితే బాగుండేదని ఆయన పవన్ కల్యాణ్ కు సలహా ఇచ్చారు. తమ పార్టీకి చెందిన ఓ వ్యక్తిపై ని్న మాజీ మహిళా వాలంటీర్ చేసిన వ్యాఖ్యలు తన దృష్టికి రాలేదని, చిన్న చిన్న పొరపాట్లు జరిగితే సరి చేసుకుంటామని ఆళ్ల రామకృష్ణా రెడ్డి చెప్పారు.

పవన్ కళ్యాణ్ ను ఎవరైనా కలవచ్చునని, కానీ వచ్చిన వారు చెప్పిన మాటలు పూర్తి స్థాయిలో తెలుసుకుని, అక్కడి వాస్తవ పరిస్థితులను తెలుసుకుని పవన్ కల్యాణ్ మాట్లాడాలని ఆయన అన్నారు.

PREV
click me!

Recommended Stories

Road Doctor: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోడ్డు డాక్ట‌ర్‌.. దేశం దృష్టిని ఆక‌ర్షిస్తోన్న స‌రికొత్త సేవ‌లు
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!