వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్ ను నిరసిస్తూ ఆయన అనుచరులు ఇవాళ శాంతి యుత ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు ఇవాళ అరెస్ట్ చేశారు.
కడప: వైఎస్ భాస్కర్ రెడ్డి ని సీబీఐ అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ ఆయన అనుచరులు ఆదివారంనాడు నిరసన ర్యాలీలకు పిలుపునిచ్చారు. శాంతియుతంగా ర్యాలీ నిర్వహించాలని కోరారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు ఇవాళ అరెస్ట్ చేశారు. ఇవాళ ఉదయం ఆరు గంటలకు వైఎస్ భాస్కర్ రెడ్డి నివాసానికి చేరుకున్న సీబీఐ అధికారులు వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు.
undefined
వైఎస్ భాస్కర్ రెడ్డిని పులివెందుల నుండి హైద్రాబాద్ కు తరలిస్తున్నారు. హైద్రాబాద్ సీబీఐ మేజిస్ట్రేట్ ముందు ఇవాళ సాయంత్రం హాజరుపర్చనున్నారు అధికారులు.వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్ ను నిరసిస్తూ ఇవాళ జిల్లా వ్యాప్తంగా నిరసన ర్యాలీలకు వైఎస్ భాస్కర్ రెడ్డి అనుచరులు పిలుపునిచ్చారు. పులివెందులలోని పూల అంగళ్లు, దుకాణాలను మూసివేశారు వైఎస్ భాస్కర్ రెడ్డి అనుచరులు నల్ల బ్యాడ్జీలు ధరించారు.
also read:వైఎస్ వివేకా హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్: పులివెందుల నుండి హైద్రాబాద్ కు తరలింపు
రెండు రోజుల క్రితం కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కి సన్నిహితుడిగా పేర్కొన్న గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించిన సాక్ష్యాలను ఉదయ్ కుమార్ రెడ్డి చెరిపివేశారని సీబీఐ ఆరోపించింది. ఉదయ్ కుమార్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో సీబీఐ ఈ అంశాలను పేర్కొంది.