కరోనా విలయం.. సీఎం రిలీఫ్ ఫండ్ కి వైఎస్ భారతి రూ.20 కోట్ల విరాళం?

Published : Mar 27, 2020, 07:46 AM ISTUpdated : Mar 27, 2020, 11:05 AM IST
కరోనా విలయం.. సీఎం రిలీఫ్ ఫండ్ కి వైఎస్ భారతి రూ.20 కోట్ల విరాళం?

సారాంశం

ఇప్పుడు వీరి జాబితాలోకి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భార్య వైఎస్ భారతి కూడా చేరారు. ఆమె ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కి ఏకంగా రూ.20కోట్ల భారీ విరాళం అందజేశారు. దీంతో.. భారతి పై వైసీపీ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ వైరస్ ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు కూడా వ్యాపించేసింది. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే 10 కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో కరోనాని అరికట్టేందుకు ప్రభుత్వాలు అన్ని చర్యలు తీసుకుంటున్నాయి. ఇదిలా ఉండగా రాష్ట్ర్ర ప్రభుత్వాలకు చేయూత అందించేందుకు పలువురు ప్రముఖులు కూడా ముందుకు వస్తున్నారు.

ఇప్పటికే చిరంజీవి, పవన్ కళ్యాణ్ , ఎన్టీఆర్, ప్రభాస్, రాంచరణ్ లాంటి వారంతా భారీ విరాళాలు ప్రకటించారు. కాగా.. ఇప్పుడు వీరి జాబితాలోకి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భార్య వైఎస్ భారతి కూడా చేరారు. ఆమె ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కి ఏకంగా రూ.20కోట్ల భారీ విరాళం అందజేశారు. దీంతో.. భారతి పై వైసీపీ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా.. ఈ మేరకు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు.

వైఎస్ భారతి.. భారతీ సిమెంట్స్ ఛైర్ పర్సన్ అన్న విషయం తెలిసిందే. కాగా... భారతి విరాళంతో.. చంద్రబాబుకి చెందిన హెరిటేజ్ సంస్థ నుంచి ఎంత విరాళం ప్రకటిస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదరు చూస్తుండటం గమనార్హం.

ఈ సంగతి పక్కన పెడితే...ప్రభుత్వం ఎంతగా కట్టుదిట్టమైన చర్యలు  తీసుకుంటున్నా ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. తాజాగా గురువారం రాష్ట్రంలో మరో కేసు నమోదైంది. విజయవాడకు చెందిన 28 ఏళ్ల యువకుడికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఏపీలో కోవిడ్ 19 కేసులు 11కు చేరాయి.ఆ యువకుడు ఈ నెల 18న స్వీడన్ నుంచి ఢిల్లీకి వచ్చి అక్కడి నుంచి విజయవాడకు చేరుకున్నాడు. 

Also Read కరోనా ఎఫెక్ట్, ఏపీలోకి నో ఎంట్రీ: తేల్చేసిన జగన్...

ఈ క్రమంలో కరోనా లక్షణాలతో విజయవాడ జీజీహెచ్‌లో చేరాడు. ఆ యువకుని శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపగా.. పాజిటివ్‌గా రిజల్ట్ వచ్చింది. ఇతనితో కలిపి బెజవాడలో కరోనా సోకిన వారి సంఖ్య మూడుకు చేరింది.నగరంలో వరుసగా కరోనా కేసులు బయటపడుతుండటంతో బెజవాడ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. బుధవారం వాషింగ్టన్ నుంచి విజయవాడ వచ్చిన 21 ఏళ్ల యువకుడికి కరోనా సోకినట్లు నిర్ధారించారు.

మరో వైపు, గుంటూరు జిల్లాలో ఓ కరోనా కేసు బయటపడింది. ప్రత్యేక ప్రార్థనల్లో పొల్గొని ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలింది. ఈ రెండు కేసులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పదికి చేరుకుంది. 

చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తికి చెందిన యువకుడికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలిన విషయం తెలిసిందే. లండన్ లో ఎంసిఏ చదువుతున్న ఆ యువకుడు ఈ నెల 18వ తేదీన లండన్ నుంచి బయలుదేరి 19వ తేదీన శ్రీకాళహస్తి చేరుకున్నాడు. 

తెలంగాణలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 41కి చేరుకుంది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోంది. మహారాష్ట్రలో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

PREV
click me!

Recommended Stories

ఈరెండు హాస్పిటళ్ళ అభివృద్దికి 5 కోట్లు | Pemmasani Speech | Medical Equipments | Asianet News Telugu
కరెంట్ చార్జీలపైCM Chandrababu Naidu Strong Speech | Electricity Charges | Asianet News Telugu