పెళ్లి చేసుకోమందని అతను.. మోసం చేశాడని ఆమె...

Published : Mar 26, 2020, 02:24 PM IST
పెళ్లి చేసుకోమందని అతను.. మోసం చేశాడని ఆమె...

సారాంశం

అదే గ్రామానికి చెందిన మాండ్రు చంద్రపాల్, మార్తమ్మ  రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. చంద్రపాల్‌ పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో వారు భీమవరంలో శారీరకంగా కలుసుకున్నారు.

వారిద్దరూ ఒకరిని మరొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటాం కదా అనే ధీమాతో శారీరకంగా కలుసుకున్నారు. అయితే.. ఇంకా ఎంత కాలం ఇలా ప్రేమించుకుంటామని ఆమె పెళ్లి చేసుకుందామని ప్రియుడిని కోరింది. అతను అంగీకరించకపోవడంతో మోసపోయానని భావించి ఆత్మహత్యకు పాల్పడింది. విచిత్రం ఏమిటంటే... ప్రియురాలు పెళ్లి చేసుకోమని అడిగిందనే కారణంతో ఆ ప్రియుడు కూడా ఆత్మ హత్యాయత్నాని పాల్పడటం గమనార్హం. ఈ సంఘటన తూర్పు గోదావరి జిల్లాలో చోటుచేసుకోగా... పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read జనసంచారం లేకపోవటంతో... తిరుమల కొండపై పులుల సంచారం...

పాలకోడేరు మండలం కుముదవల్లి గ్రామానికి చెందిన గుమ్మళ్ల మార్తమ్మ ఇంటర్‌ వరకూ చదివి ఇంట్లో ఉంటోంది. అదే గ్రామానికి చెందిన మాండ్రు చంద్రపాల్, మార్తమ్మ  రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. చంద్రపాల్‌ పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో వారు భీమవరంలో శారీరకంగా కలుసుకున్నారు.

ఈ నేపథ్యంలో చంద్రపాల్‌ను పెళ్లి చేసుకోమని అడిగిందని మంగళవారం అతను పురుగు మందుతాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. బంధువులు చూసి అతడిని ఆస్పత్రిలో చేర్పించడంతో కోలుకుంటున్నాడు. చంద్రపాల్‌ పెళ్లి చేసుకోనని చెప్పడంతో మార్తమ్మ ఆమె తల్లి వాడే థైరాయిడ్‌ మందులు బుధవారం ఉదయం అధికంగా వేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. భీమవరం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం ఏలూరు తరలించారు. ఇద్దరూ ప్రాణాలతో బయట పడ్డారని పోలీసులు చెప్పారు.  ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వారు చెప్పారు.

PREV
click me!

Recommended Stories

AP Telangana Weather Alert: ఏపీ, తెలంగాణలో మరో 6 రోజులు దంచికొట్టనున్న వర్షాలు
మావి కుటుంబాలు కాదా చంద్రబాబు రెచ్చిపోయిన జోగి | Jogi Ramesh Family Issue