రేప్ చేసిన వారిని ఉరితీయడం ఏంటి రెండు బెత్తం దెబ్బలు చాలు అని పవన్ కళ్యాణ్ అనడంపై రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఏం జరిగిందని రివాల్వర్ పట్టుకుని రోడ్లపైకి వచ్చారో చెప్పాల్సిన అవసరం ఉందని రోజా నిలదీశారు.
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా పోటీ చేసిన రెండు నియోజవకర్గాల్లోనూ ఓటమి పాలైన నాయకుడు అంటూ సెటైర్లు వేశారు.
రేప్ చేసిన వారిని ఉరితీయడం ఏంటి రెండు బెత్తం దెబ్బలు చాలు అని పవన్ కళ్యాణ్ అనడంపై రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఏం జరిగిందని రివాల్వర్ పట్టుకుని రోడ్లపైకి వచ్చారో చెప్పాల్సిన అవసరం ఉందని రోజా నిలదీశారు.
undefined
మా అక్కను అవమానిస్తే వారిని చంపాలని అనిపించిందని ఒక ఇంటర్వ్యూలో చెప్పిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ తర్వాత దిశ రేప్ హత్య ఘటన విషయానికి వచ్చే సరికి మాత్రం రెండు బెత్తం దెబ్బలు తగిలిస్తే చాలు చంపే హక్కులేదని అంటారా అంటూ నిలదీశారు.
పవన్ కళ్యాణ్ ఇంట్లో వారికి ఏదైనా జరిగితే ఒక న్యాయం ప్రజలకు ఏదైనా జరిగితే మరోలా వ్యవహరిస్తారా అంటూ రోజా నిలదీశారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు పవన్ కళ్యాణ్ కు తెలియజేయాలని రోజా కోరారు.
లోకేష్ పప్పులో ఉల్లి లేదనే చంద్రబాబు బాధ: బాలకృష్ణపై విరుచుకుపడ్డ ఎమ్మెల్యే రోజా
హెచ్ఆర్సీపై రోజా ఆగ్రహం
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలంగాణ వైద్యురాలు దిశ రేప్, హత్య ఘటన తనను తీవ్రంగా కలచివేసిందన్నారు ఎమ్మెల్యే రోజా. అయితే నిందితులను ఎన్ కౌంటర్ చేసిన తర్వాత ఒక తల్లిగా తనతోపాటు దేశమంతా సంతోషించిందని తెలిపారు.
అయితే ఎన్ కౌంటర్ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టారు ఎమ్మెల్యే రోజా. తొమ్మిది నెలల చిన్నారి, ఏడేళ్ల బాలిక, 90 ఏళ్ల వృద్ధురాలు ఇలా మహిళలల, ఆడపిల్లల మాన ప్రాణాలు హరించుకుపోతున్న ఘటనలపై ఈ జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.
నలుగురు మానవ మృగాలను ఎన్ కౌంటర్ చేస్తే మానవ హక్కుల ఉల్లంఘన అంటూ హెచ్ ఆర్సీసీ అనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరస్థుల విషయంలోనే మానవ హక్కులు గుర్తొస్తాయా అంటూ నిలదీశారు.
మహిళలకు హక్కులు లేవా, ఆడపిల్లలకు హక్కులు లేవా అంటూ నిలదీశారు. మహిళలపై దారుణాలకు ఒడిగడుతున్న వారిని ఎన్ కౌంటర్ చేస్తే ఎందుకు తప్పుబడుతున్నారో చెప్పాలని ఎమ్మెల్యే రోజా నిలదీశారు.
mla roja: గన్ వచ్చే లోపు జగన్ అన్న వస్తాడు.. బాహుబలి సీన్ ను వివరించిన ఎమ్మెల్యే రోజా