చంద్రబాబుకు ‘యువత’ పెద్ద షాక్

Published : Sep 08, 2017, 09:56 AM ISTUpdated : Mar 25, 2018, 11:47 PM IST
చంద్రబాబుకు ‘యువత’ పెద్ద షాక్

సారాంశం

చంద్రబాబునాయుడుకు నిరుద్యోగ యువత పెద్ద షాకే ఇచ్చారు. రెండు వరుస విజయాలతో ఊపుమీదున్న చంద్రబాబు ఆనందానికి యువత బ్రేకులేసారు. ‘బాబూ..జాబేది’ అంటూ ఒక్కసారిగా మొదలైన నినాదాలతో మారుమోగిపోయింది. ‘ప్రభుత్వం ఏర్పడి మూడేళ్ళు దాటిపోయిన ఇంతవరకూ ఉద్యోగాలూ లేవు...నిరుద్యోగ భృతీ లేదం’టూ నిరసనకు దిగారు.

చంద్రబాబునాయుడుకు నిరుద్యోగ యువత పెద్ద షాకే ఇచ్చారు. రెండు వరుస విజయాలతో ఊపుమీదున్న చంద్రబాబు ఆనందానికి యువత బ్రేకులేసారు. గురువారం చింతలపూడిలో ఎత్తిపోతల పథకం 2వ దశకు చంద్రబాబు శంకుస్ధాపన చేసారు. తర్వాత రాజమండ్రిలో అర్బన్ ఎస్పీ, సిఐడి, నగరపాలక సంస్ధ నూతన భవనాల ప్రారంభోత్సవం జరిగింది. ఆ సందర్భంగా ‘జలసిరికి హారతి’ కార్యక్రమంలో ప్రతిజ్ఞ చేయించేందుకు సిద్ధపడ్డారు. కార్యక్రమం మొదలుకాగానే అందులో పాల్గొన్న యువత ఒక్కసారిగా అరుపులు, కేకలు మొదలుపెట్టారు.  ‘బాబూ..జాబేది’ అంటూ ఒక్కసారిగా మొదలైన నినాదాలతో మారుమోగిపోయింది. ‘ప్రభుత్వం ఏర్పడి మూడేళ్ళు దాటిపోయిన ఇంతవరకూ ఉద్యోగాలూ లేవు...నిరుద్యోగ భృతీ లేదం’టూ నిరసనకు దిగారు.

యవత నుండి మొదలైన నిరసనలతో చంద్రబాబుకు పెద్ద షాక తగిలింది. అయితే వెంటనే తేరుకుని తనదైన శైలిలో వారిపై ఎదురుదాడికి దిగారు. ‘మీరు కష్టపడితే రాష్ట్రంలోనే కాదు దేశంలో, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా ఉద్యోగాలు ఇప్పిస్తాను’ అంటూ చెప్పారు. ‘ నేను ఒక్కడినే కష్టపడితే సరిపోదు..మీరూ కష్టపడాలి. ఊరికే పైపైన రోడ్లపై తిరిగితే సరిపోదు’ అంటూ పెద్ద క్లాస్ తీసుకున్నారు. అని వెంటనే తనదైన శైలిలో అవినీతి, ఫిర్యాదులు, ప్రభుత్వ కార్యక్రమాలు తదిరాల గురించి వివరించి అక్కడి నుండి బయటపడ్డారు.

PREV
click me!

Recommended Stories

Deputy CM Pawan Kalyan: కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ సమావేశంలో పవన్ కీలక ప్రసంగం | Asianet News Telugu
CM Chandrababu: జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికిబ్రాండ్ అంబాసిడర్లు: బాబు | Asianet News Telugu