సాయంత్రం బయటికి.. రాత్రికి శవమై ఇంటికి , యువకుడి అనుమానాస్పద మృతి.. వివాహేతర సంబంధమే కారణమా

Siva Kodati |  
Published : Aug 25, 2023, 03:34 PM IST
సాయంత్రం బయటికి.. రాత్రికి శవమై ఇంటికి , యువకుడి అనుమానాస్పద మృతి.. వివాహేతర సంబంధమే కారణమా

సారాంశం

చిత్తూరు జిల్లా కుప్పంలో వివాహేతర సంబంధం యువకుడి ప్రాణం తీసింది. ఇంటి నుంచి సాయంత్రం 4 గంటల ప్రాంతంలో వెళ్లిన వినోద్ కుమార్ రాత్రి శవమై రావడంతో అతనికి ఏం జరిగిందో తెలియక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు .

చిత్తూరు జిల్లా కుప్పంలో వివాహేతర సంబంధం యువకుడి ప్రాణం తీసింది. కుప్పం పట్నానికి చెందిన వినోద్ కుమార్‌కు ఓ మహిళతో వివాహేతర సంబంధం వుంది. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం కుప్పంలోని ఓ లాడ్జిలో వినోద్ కుమార్ ఓ గదిని అద్దెకు తీసుకున్నాడు. అయితే ఏం జరిగిందో తెలియదు గానీ.. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో వినోద్ కుమార్ ఆరోగ్యం బాలేదంటూ ఇద్దరు మహిళలు అంబులెన్స్‌లో అతనిని కుప్పం పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే ఆ యువకుడు మృతి చెందాడు. అనంతరం అతని మృతదేహాన్ని ఇద్దరు మహిళలు డోర్ డెలివరీ చేయడానికి వెళ్లారు. 

ఇంటి నుంచి సాయంత్రం 4 గంటల ప్రాంతంలో వెళ్లిన వినోద్ కుమార్ రాత్రి శవమై రావడంతో అతనికి ఏం జరిగిందో తెలియక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు . రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కుప్పం ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వినోద్ మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన ఇద్దరు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతుడు వినోద్ కుమార్‌ది గుడిపల్లి మండలం గుడికొత్తూరు.. ఇతను కుప్పంలో ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్