వివాహేతర సంబధం.. యువకుడి దారుణ హత్య

Published : Jan 18, 2019, 11:18 AM IST
వివాహేతర సంబధం.. యువకుడి దారుణ హత్య

సారాంశం

భార్యని కాదని.. మరో యువతితో వివేహతర సంబధం పెట్టుకున్నాడో వ్యక్తి. అతనికి మద్దతుగా నిలిచినందుకు ఓ యువకుడు దారుణ హత్యకు గురికావాల్సి వచ్చింది. 

భార్యని కాదని.. మరో యువతితో వివేహతర సంబధం పెట్టుకున్నాడో వ్యక్తి. అతనికి మద్దతుగా నిలిచినందుకు ఓ యువకుడు దారుణ హత్యకు గురికావాల్సి వచ్చింది. ఈ దారుణ సంఘటన విశాఖ జిల్లా గాజువాకలోని గంగవరం గ్రామంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...పెదగంట్యాడ మండలం గంగవరం గ్రామానికి చెందిన పేర్ల ధనరాజు (29), చోడిపిల్లి నరేష్‌ దగ్గరి  బంధువులు. ఇద్దరూ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో కాంట్రాక్టు కార్మికుడిగా పని చేస్తున్న పోలారావు కి నరేష్ సోదరితో వివాహం జరిగింది. ఈ పోలారావు ధనరాజుకి మేనమామ అవుతాడు.

కాగా.. పోలారావు కట్టుకున్న భార్యని కాదని.. వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయంలో  నరేష్ కి పోలారావుకి తరచూ గొడవలు జరుగుతున్నాయి. అయితే.. ధనరాజు మాత్రం తన మేనమామ పోలారావుకి మద్దతుగా నిలవడంతో.. అతనిపై నరేష్ పగపెంచుకున్నాడు.

ఈ క్రమంలో పెదగంట్యాడలో బుధవారం జరిగిన ఒక పరసకు వెళ్లిన పోలారావు, ధనరాజు, నరేష్‌ కలిసి మద్యం సేవించారు. రాత్రి పది గంటల సమయంలో గంగవరం గ్రామానికి చేరుకున్న తరువాత పాతగొడవలు, వివాహేతర సంబంధాలపై గాంధీ జంక్షన్‌ వద్ద మళ్లీ గొడవ మొదలైంది. ఈ గొడవ సాగుతుండగానే పోలారావు అక్కడికి సమీపంలో ఉన్న తన ఇంటికి వెళ్లిపోయాడు. 

దీంతో నరేష్‌ కూడా వెళ్లిపోతున్నట్టుగా నమ్మించి...  ధనరాజు ఇంటికి వెళ్లే మార్గంలోని ఒక గ్రౌండ్‌ వద్ద తన స్నేహితులతో కలిసి మాటు వేశాడు. కొద్ది సేపటి తరువాత తన ఇంటికి వెళ్తున్న ధనరాజుపై తన స్నేహితులతో కలిసి నరేష్‌ దాడికి పూనుకున్నాడు.ఈ సంఘటనలో బీరు బాటిల్‌తో ధనరాజు తలపై గట్టిగా మోదడంతోపాటు అదే బీరు బాటిల్‌తో అతడి గొంతుకోసి హత్య చేశాడు. 

ధనరాజు మృతి చెందాడని నిర్థారించుకున్న తరువాత అక్కడి నుంచి అందరూ పరారయ్యారు. అర్ధరాత్రి కావస్తున్నా తన కుమారుడు ఇంటికి చేరకపోవడంతో అతడి తల్లి సింహాచలం గాంధీ జంక్షన్‌కు సమీపంలో ఉంటున్న పోలారావు ఇంటికి వెళ్లింది. తాను చాలాసేపటి క్రితమే ఇంటికి వచ్చేశానని చెప్పడంతో గ్రామంలో వెతకడం ప్రారంభించారు. దీంతో గ్రౌండ్‌ వద్ద రక్తపు మడుగులో ధనరాజు శవమై కనిపించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu