సంచలనం సృష్టించిన బీ ఫార్మాసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసును సిట్( ప్రత్యేక దర్యాప్తు బృందం) దర్యాప్తు చేస్తూ వచ్చింది. అయితే హత్య కేసుకు సంబంధించిన వివరాలను హైకోర్టు సిట్ అధికారులను కోరగా...ఆ రికార్డులు విజయవాడ కోర్ట్ లో దగ్దమయ్యాయని తెలిపారు.
విజయవాడ: ఆయేషా మీరా హత్య కేసులో సిబిఐ దూకుడు పెంచింది. ఈ కేసులో నిర్దోషిగా విడుదలైన సత్యంబాబును సిబిఐ అధికారులు శుక్రవారం ఉదయం నుంచి విచారిస్తున్నారు. సత్యంబాబు కుటుంబ సభ్యుల వాంగ్మూలాలను కూడా రికార్డు చేస్తున్నారు.
విజయవాడలోని నందిగామ ఆగమనసాగరంలో సిబిఐ అధికారులు విచారణ సాగిస్తున్నారు. ఇబ్రహీంపట్నంలోని దుర్గా హాస్టల్ నిర్వాహకులను కూడా సిబిఐ అధికారులు విచారించే అవకాశం ఉంది.
సంచలనం సృష్టించిన బీ ఫార్మాసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసును సిట్( ప్రత్యేక దర్యాప్తు బృందం) దర్యాప్తు చేస్తూ వచ్చింది. అయితే హత్య కేసుకు సంబంధించిన వివరాలను హైకోర్టు సిట్ అధికారులను కోరగా...ఆ రికార్డులు విజయవాడ కోర్ట్ లో దగ్దమయ్యాయని తెలిపారు.
దీనిపై సీరియస్ అయిన హైకోర్టు ఈ కేసు విచారణను సిబిఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దాంతో సిబిఐ రంగంలోకి దిగింది. రికార్డుల దగ్ధం పై కూడా విచారణ చేపట్టాల్సిందిగా సిబిఐని కోర్టు ఆదేశించింది.
సంబంధిత వార్తలు
అయేషా మీరా హత్య కేసు: కుట్ర కోణాలను రట్టు చేసిన సిబిఐ
అయేషా మీరా హత్యకేసు: రంగంలోకి దిగిన సీబీఐ
అయేషా మీరా హత్యకేసు: ముగ్గురిపై కేసు నమోదు చేసిన సీబీఐ
బ్రేకింగ్ న్యూస్...అయేషా మీరా హత్య కేసులో కీలక మలుపు