పవన్ పై మురళీ మోహన్ సీరియస్ కామెంట్

Published : Nov 29, 2018, 02:46 PM IST
పవన్ పై మురళీ మోహన్ సీరియస్ కామెంట్

సారాంశం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై టీడీపీ ఎంపీ మురళీ మోహన్ సీరియస్ అయ్యారు. తనపై పవన్ కళ్యాణ్ అనవసరంగా నిందలు వేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై టీడీపీ ఎంపీ మురళీ మోహన్ సీరియస్ అయ్యారు. తనపై పవన్ కళ్యాణ్ అనవసరంగా నిందలు వేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ రోజు ఏపీ రాజధాని అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ మురళీ మోహన్ మాట్లాడారు. బీజేపీ, జనసేనలపై ఈ సందర్భంగా మురళీ మోహన్ మండిపడ్డారు.

ప్రధాని నరేంద్రమోదీ అహంకారంతోనే ఎన్డీయే నుంచి టీడీపీ దూరం అయ్యిందని మురళీ మోహన్ పేర్కొన్నారు. దీనికి బీజేపీ భారీ మూల్యం చెల్లించక తప్పదన్నారు. దక్షిణ భారతంలో పాగా వేయాలనుకుంటున్న బీజేపీ నేతల ప్రయత్నాలు ఫలించవని అన్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ పై కూడా మండిపడ్డారు. తనపై పవన్ నిందలు వేయడం మానుకుంటే.. మంచిదని హితవు పలికారు. 

PREV
click me!

Recommended Stories

IRCTC Tirupati Kolhapur Tour: ఒక్క టికెట్ తో తిరుమల శ్రీవారి నుంచి కొల్హాపూర్ అమ్మవారి దర్శనం వరకు.. ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్
Weather Update: బంగాళాఖాతంలో ద్రోణి, ఆవర్తనం.. ఏపీ, తెలంగాణలో 3 రోజులు భారీ వర్షాలు