యరడా తీరంలో తప్పిన పెను ప్రమాదం

Published : Nov 16, 2020, 02:59 PM IST
యరడా తీరంలో తప్పిన పెను ప్రమాదం

సారాంశం

మిగిలిన మిత్రుల సమాచారంతో  న్యూ పోర్ట్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆపై పోలీసుల ఫిర్యాదుతో యువకులను రక్షించేందుకురెవెన్యూ,రెస్క్యూ, అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్ళు  రంగంలోకి దిగారు. 

విశాఖపట్నం నగరంలోని యారడా తీరంలో పెను ప్రమాదం తప్పింది. ఏడుగురు యువకులు ఆదివారం కావడంతో  ఆడవిడుపుగా యారడా తీరానికి వచ్చారు. కాగా అలల తాకిడి అధికంగా ఉండటంతో  తీరంలోని పిట్ల కొండ వద్ద ముగ్గురు యువకులు రాళ్ళల్లో చిక్కుకున్నారు. యువకులు నగరానికి చెందిన కొండ నవీన్(20), భీశెట్టి యశ్వంత్(20), కె.శ్రవణ్(20)గా గుర్తించారు. 

మిగిలిన మిత్రుల సమాచారంతో  న్యూ పోర్ట్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆపై పోలీసుల ఫిర్యాదుతో యువకులను రక్షించేందుకురెవెన్యూ,రెస్క్యూ, అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్ళు  రంగంలోకి దిగారు. యువకులను రక్షించేందుకు అధికార యంత్రాంగం విశ్వప్రయత్నాలు చేసింది.  ఎట్టకేలకు అర్ధరాత్రి ఒంటిగంటన్నర సమయంలో  గజ ఈతగాళ్ళు యువకులను రక్షించారు. యువకులు ప్రాణాలతో తీరానికి రావడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

Christmas Holidays : ఓరోజు ముందుగానే క్రిస్మస్ సెలవులు.. ఎప్పటివరకో తెలిస్తే ఎగిరిగంతేస్తారు..!
Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu