సరదాగా అన్నమాటే నిజమైంది... ఇదే చివరి రోజంటూ...

Published : Jan 02, 2020, 10:10 AM ISTUpdated : Jan 02, 2020, 10:14 AM IST
సరదాగా అన్నమాటే నిజమైంది... ఇదే చివరి రోజంటూ...

సారాంశం

 ‘ ఒరేయ్ బావా...చూడు, ఇదే నా చివరి సెల్ఫీ.. ఈ సంవత్సరానికి ఇదే ఆఖరి రోజు కదా.. అందుకే ఇదే చివరిది’ అంటూ సరదాగా ఫ్రెండ్ తో అన్నమాటలు ఆ యువకుడి విషయంలో నిజమయ్యాయి. 

అందరం న్యూ ఇయర్ లోకి అడుగుపెట్టాం. డిసెంబర్ 31 వ తేదీన అందరూ సంబరాలు చేసుకున్నారు. ఆ సమయంలో ఓ యువకుడు సరదాగా చెప్పిన మాటలే అతని జీవితంలో నిజమయ్యాయి. డిసెంబర్ 31వ తేదీన ఓ యువకుడు చివరగా సెల్ఫీ తీసుకొని అదే చివరిదంటూ పేర్కొన్నాడు. ఆ తర్వాత జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాడు. ఈ సంఘటన విజయనగరంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ‘ ఒరేయ్ బావా...చూడు, ఇదే నా చివరి సెల్ఫీ.. ఈ సంవత్సరానికి ఇదే ఆఖరి రోజు కదా.. అందుకే ఇదే చివరిది’ అంటూ సరదాగా ఫ్రెండ్ తో అన్నమాటలు ఆ యువకుడి విషయంలో నిజమయ్యాయి. ఇవే మాటలతో అతను టిక్ టాక్ చేశాడు. విజయనగరం జిల్లా బొండవల్లి మండలం ఎం.కొత్తవలసకు చెందిన ఎం.వినోద్ గంట్యాడ మండలం పెదమజ్జిపాలెంకు చెందిన ఇద్దరు స్నేహితులతో కలిసి మంగళవారం రాత్రి వరకు ఆనందంగా గడిపాడు.

ఈ సంవత్సరానికి ఇదే చివరి సెల్ఫీ అంటూ వీడియో చిత్రీకరించి పెట్టాడు. ఇది చిత్రీకరించిన కొద్ది గంటలకే ముగ్గురూ ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. బొండవల్లి మండలం యడ్లపాలెం సమీపంలో అర్థరాత్రి దాటాక తాటి చెట్టును ఢీకొట్టారు. ఈ ఘటనలో వినోద్ పక్కనే ఉన్న చెరువులో పడి చనిపోయాడు. మిగిలిన ఇద్దరూ గాయపడ్డారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్