ఆ అర్హత ఉందా..? టిక్ టాక్ లు చేస్తూ కాలక్షేపం చేస్తూ... పుష్పశ్రీవాణికి అనిత కౌంటర్

Published : Jan 02, 2020, 08:46 AM IST
ఆ అర్హత ఉందా..? టిక్ టాక్ లు చేస్తూ కాలక్షేపం చేస్తూ... పుష్పశ్రీవాణికి అనిత కౌంటర్

సారాంశం

గత 20  సంవత్సారాలకుపైగా  పైగా  ఎలాంటి ఆరోపణలు లేకుండా హెరిటేజ్‌ సంస్ధను పారదర్శకంగా నడుపుతూ..మహిళాలోకానికి ఆదర్శమైన నారా భువనేశ్వరిని  పుష్ప శ్రీవాణి విమర్శించటం విడ్డూరంగా ఉందన్నారు.

బోగస్ సర్టిఫికెట్లతో ఎస్టీ అని చెప్పుకొని ఎమ్మెల్యే సీటు తెచ్చుకున్న డిప్యుటీ సీఎం పుష్ప శ్రీవాణి నారా భువనేశ్వరి విమర్శించే నైతిక అర్హత లేదంటూ టీడీపీ మహిళా నేత వంగలపూడి అనిత అన్నారు. అమరావతి రైతుల కోసం మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి తన గాజులను ఇచ్చిన సంగతి తెలిసిందే. అలా ఇవ్వడంపై పుష్పశ్రీవాణి విమర్శలు చేశారు.

కాగా... ఆమె చేసిన విమర్శలకు వంగలపూడి అనిత తాజాగా ప్రతివిమర్శలు చేశారు. గత 20  సంవత్సారాలకుపైగా  పైగా  ఎలాంటి ఆరోపణలు లేకుండా హెరిటేజ్‌ సంస్ధను పారదర్శకంగా నడుపుతూ..మహిళాలోకానికి ఆదర్శమైన నారా భువనేశ్వరిని  పుష్ప శ్రీవాణి విమర్శించటం విడ్డూరంగా ఉందన్నారు.

 ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ గురించి మాట్లాడుతున్న పుష్ప శ్రీవాణికి దాని అర్ధం తెలుసా?   హెరిటేజ్‌ భూములకు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ఆరోపణలకు అసలు సంబందం లేదన్నారు. హెరిటేజ్‌ సంస్ధ తన కంపెనీ విస్తరణ దృష్ట్యా రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్‌లో భూములు కొనాలని 2014 మార్చిలోనే హెరిటేజ్‌ బోర్డు నిర్ణయం తీసుకుందన్నారు.

 దానికనుగుణంగా  భూములు   కొనుగోలు చేయటం జరిగిందని చెప్పారు. ఈ భూములు అసలు  రాజధాని పరిధిలో లేవని స్పష్టం చేశారు. హెరిటేజ్‌ సంస్ధ తన వ్యాపారాల కోసం భూములు కొనటం ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ఎలా అవుతుందో ఆమె చెప్పాలని డిమాండ్ చేశారు.  

రాజధాని అమరావతి మార్పుపై రాష్ట్రంలోని మహిళలంతా ఆందోళన వ్యక్తం చేస్తుంటే  సాటి మహిళగా వారికి అండగా నిలవాల్సిందిపోయి, ఇలా టిక్‌టాక్‌ వీడియోలు చేస్తు కాలక్షేపం చేయటం సిగ్గుచేటన్నారు.  

మీరు టిక్‌టాక్‌  వీడియోలు చేయాల్సింది ఖైదీ నెం 6093 దోచుకున్న  లక్ష కోట్లను బయటపెట్టాలని టిక్‌టాక్‌ వీడియోలు చేయాలన్నారు. అసలు మీకు భువనేశ్వరి విమర్శించే అంత అర్హత ఉందా అని ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలని మండిపడ్డారు.

PREV
click me!

Recommended Stories

Yarlagadda Venkata Rao Slams Jagan Mohan Reddy | AP Development | TDP VS YCP | Asianet News Telugu
సరుకు, సామాన్లు పదాలు బూతులుగా ఎందుకు మారాయి? | Telugu Explainer | Asianet News Telugu