ఏపీ సీఎం వైఎస్ జగన్ తో సినీ ప్రముఖుల బృందం ఇవాళ భేటీ అయింది. చిరంజీవి నేతృత్వంలోని బృందం జగన్ తో భేటీ అయింది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి YS Jagan తో సినీ ప్రముఖులు గురువారం నాడు అమరావతిలో భేటీ అయ్యారు. Chiranjeevi నేతృత్వంలోని పలువురు సినీ నటులు, దర్శకులు, నిర్మాతలు ఈ భేటీలో పాల్గొన్నారు. Tollywood Cine పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం ఈ సమావేశంలో కీలక నిర్ణయాలను తీసుకొనే అవకాశం ఉంది.
Cinema టికెట్ల ధరల పెంపుతో పాటు సినీ పరిశ్రమపై టాలీవుడ్ సినీ ప్రముఖులు సీఎం జగన్ తో చర్చించనున్నారు. ఈ ఏడాది జనవరి 13వ తేదీన ఈ విషయాలపై ఏపీ సీఎం వైఎస్ జగన్ తో చిరంజీవి చర్చించారు. అయితే సినీ రంగ సమస్యలను చిరంజీవి సీఎం జగన్ కు వివరించారు. అన్ని విషయాలపై జగన్ సానుకూలంగా స్పందించారని చిరంజీవి ఆ సమావేశం ముగిసిన తర్వాత మీడియాకు వివరించారు.ఇవాళ ఏపీ సీఎం వైఎస్ జగన్ తో చిరంజీవి నేతృత్వంలో మహేష్ బాబు, ప్రభాస్, దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, నిర్మాత నిరంజన్ రెడ్డి , నారాయణమూర్తి, ఆలీ, పోసాని కృష్ణమురళి తదితరులున్నారు
సినిమా టికెట్ల ధరను నిర్ణయించడానికి ఇప్పటికే ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. సినీ ప్రముఖులు కొందరు గతంలో ఈ కమిటీతో పలు అంశాలపై చర్చించారు. సినిమా టికెట్ల ధరలతో పాటు మరో 17 అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. సినిమా టికెట్ల ధరను నిర్ణయించడానికి ఇప్పటికే ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. సినీ ప్రముఖులు కొందరు గతంలో ఈ కమిటీతో పలు అంశాలపై చర్చించారు. సినిమా టికెట్ల ధరలతో పాటు మరో 17 అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఏపీ రాష్ట్రప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం మేరకు బెనిఫిట్ షోలను ప్రదర్శించడానికి వీల్లేదు.
మరో వైపు ప్రభుత్వం నిర్ణయించిన ధరల మేరకే సినిమా టికెట్లను విక్రయించాలి. అయితే గతంలో మాత్రం సినిమా టికెట్ల ధరల విషయంలో కొంత వెసులుబాటు ఉండేది. సామాన్యులకు ఇబ్బంది కల్గించకూడదనే ఉద్దేశ్యంతోనే తాము సినిమా టికెట్ల విషయంలో ఈ నిర్ణయం తీసుకొన్నామని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇష్టా రీతిలో సినిమా టికెట్ల దరలను పెంచకుండా ఉండేందుకే ఈ చట్టం తెచ్చామని జగన్ సర్కార్ తేల్చి చెప్పింది. మరోవైపు సినిమా టికెట్లను ఆన్ లైన్ లో విక్రయిస్తున్నారు.ఆన్ లైన్ లో టికెట్ల విక్రయం గతంలో ప్రైవేట్ సంస్థల చేతుల్లో ఉండేది. కానీ ప్రస్తుతం ప్రభుత్వమే ఆన్ లైన్ వ్యవస్థను నడుపుతుంది.
కరోనా నేపథ్యంలో మొత్తం పది మంది సినీ ప్రముఖులకు సీఎంఓ నుండి ఆహ్వానాలు అందాయని సమాచారం. ఈ ఆహ్వానాలు అందుకొన్న వారిలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉన్నారు. అయితే నాగార్జున , జూ. ఎన్టీఆర్ లు మాత్రం ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు.
ఈ భేటీకి బయలుదేరడానికి ముందుగా బేగంపేట ఎయిర్ పోర్టులో చిరంజీవి మీడియాతో మాట్లాడారు. సీఎంతో భేటీ తర్వాత అక్కడే మీడియా పాయింట్ వద్ద మాట్లాడనున్నట్టుగా తెలిపారు. టాలీవుడ్ సమస్యలకు ఈరోజుతో శుభం కార్డం పడుతుందని అనుకుంటున్నట్టుగా తెలిపారు. అయితే సీఎం జగన్‌తో భేటీకి తనకు ఆహ్వానం ఉందని ఈ భేటీకి ఎవరెవరో వస్తున్నారో తనకు తెలియదని చిరంజీవి వ్యాఖ్యానించారు.