ప్రేమ విఫలం..చనిపోతున్నానని మెసేజ్ పెట్టి యువకుడి ఆత్మహత్య

Published : Jul 26, 2019, 11:22 AM IST
ప్రేమ విఫలం..చనిపోతున్నానని మెసేజ్ పెట్టి యువకుడి ఆత్మహత్య

సారాంశం

శివ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని అతని స్నేహితులు చెబుతున్నారు. కొంతకాలం క్రితం పదో తరగతి చదివే అమ్మాయిని ప్రేమించాడు. పెద్దలు వార్నింగ్ ఇవ్వడంతో... కొంతకాలంగా ఆమెకు దూరంగా ఉంటుున్నాడు

ప్రేమలో ఫెయిల్ అయ్యాననే బాధతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకొని కన్నుమూశాడు. ఈ విషాదకర సంఘటన శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం ధర్మపురం గ్రామంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...

ధర్మపురం గ్రామానికి చెందిన పైలా పురుషోత్తం, భవానీ దంపతుల మూడో కుమారుడు పైలా శివ(22) ఇంటర్ పూర్తి చేశాడు. అనంతరం తనకు నచ్చిన రంగాన్ని ఎంచుకొని జీవనం సాగిస్తున్నాడు. కాగా... రెండు రోజుల క్రితం శివ ఒరిస్సాలోని తన తాతగారింటికి వెళ్లాడు. కాగా.. వాట్సాప్ లో ‘‘సో సాడ్’’, చనిపోతున్నాను ఫ్రెండ్స్ అని మెసేజ్ పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. స్నేహితులు ఇంటికి వెళ్లి చూసేసనికి అపస్మారక స్థితిలో ఉన్నాడు.

ఆస్పత్రికి తరలించగా.. చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాగా... శివ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని అతని స్నేహితులు చెబుతున్నారు. కొంతకాలం క్రితం పదో తరగతి చదివే అమ్మాయిని ప్రేమించాడు. పెద్దలు వార్నింగ్ ఇవ్వడంతో... కొంతకాలంగా ఆమెకు దూరంగా ఉంటుున్నాడు. తాజాగా... మరోసారి ఆ అమ్మాయిని కలుసుకోవాలని ప్రయత్నించగా..కుదరలేదు. దీంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు అతని స్నేహితులు చెబుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే
Cold Wave Alert : తెలంగాణపై చలి పంజా.. ఈ జిల్లాల్లో వచ్చే పదిరోజులు అత్యల్ప ఉష్ణోగ్రతలు