తాత ఆపరేషన్ కు అత్త డబ్బులు పంపితే.. ఆన్ లైన్ గేమ్స్ లో పోగొట్టి.. యువకుడు ఆత్మహత్య...

By SumaBala BukkaFirst Published Jun 6, 2023, 8:25 AM IST
Highlights

కోనసీమ జిల్లాలో ఆన్ లైన్ గేమ్స్ కు యువకుడు బలయ్యాడు. ఆన్ లైన్ గేమ్ లో రూ.78వేలు పోగొట్టి వాటిని తిరిగి ఎలా సంపాదించాలో తెలియక బలవన్మరణానికి పాల్పడ్డాడు.  

కోనసీమ : ఆంధ్రప్రదేశ్ లోని కోనసీమ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆన్ లైన్ గేమ్స్ కు ఓ యువకుడు బలయ్యాడు. ఆన్ లైన్ గేమ్స్ లో డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సాధ్విక్ అనే యువకుడు తన తాత అకౌంట్లో ఉన్న రూ.78వేలు ఆన్ లైన్ గేమింగ్ లో ఓడిపోయాడు. దీంతో ఆ డబ్బులు తిరిగి ఎలా సంపాదించాలో తెలియలేదు. ఇంట్లో వాళ్లకు ఏం సమాధానం చెప్పాలో తెలియక బలవన్మరణానికి పాల్పడ్డాడు. 

ఆన్ లైన్ గేమ్స్ లో డబ్బులు రెట్టింపవుతాయన్న ఆశతో.. తన దగ్గరున్నదంతా పెట్టేశాడు. ఆ తరువాత తాత అకౌంట్లోని డబ్బులు కూడా ఖాళీ చేశాడు. తాత ఆపరేషన్ కోసం సాధ్విక్ మేనత్త దుబాయ్ నుంచి ఆ డబ్బులు పంపించింది. కానీ ఒళ్లూ పై తెలియకుండా డబ్బులు పెట్టుకుంటూ.. గేమ్స్ ఆడుతూ పోయిన సాధ్విక్ ఆ డబ్బులు పోగొట్టాడు. ఇంట్లో వాళ్లకు మొహం చూపించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిమీద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. 

click me!