కరోనా భయంతో నీటి సంపులో దూకి ఆత్మహత్య: శవాన్ని తీయడానికి వెనకంజ

Published : Apr 24, 2021, 10:50 AM IST
కరోనా భయంతో నీటి సంపులో దూకి ఆత్మహత్య: శవాన్ని తీయడానికి వెనకంజ

సారాంశం

కరోనాపై అవగాహన లేక భయంతో ఓ యువకుడు కృష్ణా జిల్లాలో నీటి సంపులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. శవాన్ని వెలికి తీయడానికి స్థానికులు ముందుకు రాలేదు. పోలీసులు శవాన్ని వెలికితీశారు.

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. కరోనా సోకిందనే భయంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. 30 ఏళ్ల లక్ష్మణ్ అనే యువకుడు నీటి సంపులో దూకి ఆత్మహత్యచేసుకున్నాడు. 

కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పెద్ద అవుటపల్లిలో ఆ సంఘటన చోటు చేసుకుంది. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని వెలికి తీసేందుకు స్థానికులు ఎవరూ ముందుకు రాలేదు. 

తమకు అందిన సమాచారంతో ఆత్కూరు పోలీసులు అప్రమత్తమయ్యారు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. కరోనా వైరస్ మీద సరైన అవగాహన లేక ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాపిస్తున్న విషయం తెలిసిందే. కరోనా బారిన పలువురు చిక్కుకుంటున్నారు. మరణాలు కూడా సంభవిస్తున్నాయి.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్