ఏపీలో పరిస్ధితి భయానకం: ఒక్కరోజులో 6 వేలకు పైగా కేసులు.. చిత్తూరులో అత్యధికం

Siva Kodati |  
Published : Apr 16, 2021, 07:49 PM IST
ఏపీలో పరిస్ధితి భయానకం: ఒక్కరోజులో 6 వేలకు పైగా కేసులు..  చిత్తూరులో అత్యధికం

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సెకండ్ వేవ్ అల్లకల్లోలం సృష్టిస్తోంది. మొదటి దశ కంటే వేగంగా వైరస్ చుట్టేస్తోంది. దీంతో రోజుల వ్యవధిలో కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్త 6,096 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

దీంతో ఇప్పటి వరకు ఏపీలో కోవిడ్ బారినపడ్డ వారి సంఖ్య 9,48,231కి చేరుకుంది. కరోనా కారణంగా నిన్న ఒక్కరోజు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ వల్ల మరణించిన వారి సంఖ్య 7,373కి చేరుకుంది.

చిత్తూరులో 5, కృష్ణ 3, అనంతపురం, కడప, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, విశాఖపట్నంలలో ఇద్దరు చొప్పున మృత్యువాత పడ్డారు. గడిచిన 24 గంటలలో 2,194 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. వీరితో కలిపి ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 9,05,266కి చేరింది.

ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 35,592 యాక్టివ్ కేసులున్నాయి. గడిచిన 24 గంటల్లో 35,962 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు కరోనా టెస్టుల సంఖ్య 1,56,06,163కి చేరుకుంది.

గత 24 గంటల వ్యవధిలో అనంతపురం 313, చిత్తూరు 1,024, తూర్పుగోదావరి 750, గుంటూరు 735, కడప 243, కృష్ణా 246, కర్నూలు 550, నెల్లూరు 354, ప్రకాశం 491, శ్రీకాకుళం 534, విశాఖపట్నం 489, విజయనగరం 299, పశ్చిమ గోదావరిలలో 68 కేసులు నమోదయ్యాయి. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu