7నెలల కిందట యువకుల కొట్లాట.. సోషల్ మీడియాలో వైరల్

Published : Nov 18, 2020, 12:39 PM IST
7నెలల కిందట యువకుల కొట్లాట.. సోషల్ మీడియాలో వైరల్

సారాంశం

సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో అది కాస్త పోలీసుల కంట పడింది. దీంతో.. పోలీసులు రంగంలోకి దిగి నిందితులను పట్టుకున్నారు.

దాదాపు 7 నెలల కింద కొందరు యువకులు కొట్లాటకు దిగారు. అయితే.. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడం గమనార్హం. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో అది కాస్త పోలీసుల కంట పడింది. దీంతో.. పోలీసులు రంగంలోకి దిగి నిందితులను పట్టుకున్నారు. ఈ సంఘటన నెల్లూరులో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

నెల్లూరుకు చెందిన కావేరిపాకం యుగంధర్‌ తన స్నేహితుడు శ్రీకాంత్‌కు చెందిన ఇన్నోవా కారును తీసుకెళ్లగా అది ప్రమాదానికి గురైంది. దాని మరమ్మతుకు రూ.70 వేలు చెల్లించేందుకు యుగంధర్‌ నిరాకరించాడు. ఈ విషయాన్ని యుగంధర్‌ స్నేహితుడు తుమ్మగుంట రాజశేఖర్‌కు చెప్పడంతో స్నేహితులతో కలిసి ఈ ఏడాది ఏప్రిల్లో యుగంధర్‌ను బయటకు తీసుకెళ్లి చితకబాదారు. ఈ సన్నివేశాలను స్నేహితుల్లో ఒకడైన కిరణ్‌ చిత్రీకరించాడు.

ఆ వీడియోలు రెండు రోజుల నుంచి సోషల్‌, ఎలకా్ట్రనిక్‌ మీడియాల్లో హల్‌చల్‌ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కావడంతో పోలీసులు దృష్టి సారించి ఎట్టకేలకు నిందితులను గుర్తించారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు రాజశేఖర్‌ నగరంలోని మరో కేసులోనూ సంబంధాలు ఉండటంతో రెండు కేసులు నమోదు చేసినట్లు నెల్లూరు నగర, రూరల్‌ డీఎస్పీలు శ్రీనివాసరెడ్డి, హరనాథరెడ్డి మంగళవారం తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Vijaysai Reddy Sensational Comments On YS Jagan | Asianet News Telugu
Annadata Sukhibhava: రైతుల‌కు ద‌స‌రా కానుక‌.. ఖాతాల్లోకి రూ. 6000 జ‌మ‌, ఎప్పుడంటే.?