ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు: ప్రభుత్వంపై ఎస్ఈసీ గవర్నర్‌కి ఫిర్యాదు

Published : Nov 18, 2020, 12:34 PM IST
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు: ప్రభుత్వంపై ఎస్ఈసీ గవర్నర్‌కి ఫిర్యాదు

సారాంశం

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు గాను రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఫిర్యాదు చేసినట్టుగా సమాచారం.  

అమరావతి: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు గాను రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఫిర్యాదు చేసినట్టుగా సమాచారం.

ఏపీ రాష్ట్ర గవర్నర్ హరిచందన్ తో బుధవారం నాడు ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సుమారు 40 నిమిషాల పాటు సమావేశమయ్యారు.ఈ సమావేశంలో రాష్ట్రంలో స్థానిక సంస్థల నిర్వహణ విషయమై చర్చించారు. ఎన్నికల నిర్వహణ విషయంలో పలు రాజకీయ పార్టీలతో చర్చించిన సమావేశ వివరాలను ఎస్ఈసీ రాష్ట్ర గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది.

also read:జగన్ ఎంత దూరమైనా వెళ్తాడు: ఏపీ స్థానిక పోరుపై జేసీ దివాకర్ రెడ్డి సంచలనం

ఎస్ఈసీకి రాష్ట్ర ప్రభుత్వం నుండి సహకారం అందడం లేదని ఈ సందర్భంగా గవర్నర్ కు ఫిర్యాదు చేశారు.పొరుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నా కూడ రాష్ట్రంలో కరోనా పేరుతో స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకొనేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారని తెలుస్తోంది.

also read:గవర్నర్‌ బిశ్వభూషణ్‌తో నిమ్మగడ్డ రమేష్ కుమార్ భేటీ: స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ

స్వయంప్రతిపత్తి గల ఎస్ఈసీ సంస్థలను చిన్నబుచ్చే విధంగా ప్రభుత్వం అధికారులను ప్రోత్సహిస్తోందని గవర్నర్ కు ఎస్ఈసీ ఫిర్యాదు చేశారని సమాచారం.ఏపీ హైకోర్టుల్లో కూడ ఇదే విషయాన్ని ఎస్ఈసీ పేర్కొందని గవర్నర్ వద్ద ప్రస్తావించారు.


 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Naidu Speech | సెమీ క్రిస్మస్ వేడుకల్లో చంద్రబాబు నాయుడు | Asianet News Telugu
Kandula Durgesh Super Speech: ప్రతీ మాట ప్రజా సంక్షేమం కోసమే మాట్లాడాలి | Asianet News Telugu