సామర్లకోటలో నడిరోడ్డుపై యువకుడి దారుణ హత్య.. పుట్టినరోజు అని సినిమాకు వెళితే..

Published : May 01, 2022, 04:49 PM IST
సామర్లకోటలో నడిరోడ్డుపై యువకుడి దారుణ హత్య.. పుట్టినరోజు అని సినిమాకు వెళితే..

సారాంశం

కాకినాడ జిల్లా సామర్లకోటలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. నడి రోడ్డుపై యువకుడిని అంద మరో వ్యక్తి కిరాతకంగా నరికి చంపాడు. మృతిచెందిన యువకుడిని శివగా గుర్తించారు.

కాకినాడ జిల్లా సామర్లకోటలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. నడి రోడ్డుపై యువకుడిని అంద మరో వ్యక్తి కిరాతకంగా నరికి చంపాడు. మృతిచెందిన యువకుడిని శివగా గుర్తించారు. వివరాలు.. శివ ఈ రోజు తన పుట్టిన రోజు కావడంతో సినిమా చూసేందుకు వెళ్లాడు. అయితే థియేటర్ వద్ద శివపై మణి అనే వ్యక్తి దాడి చేశాడు. అతి కిరాతకంగా నరికి చంపాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

అనంతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే శివ, మణి మధ్య మహిళ విషయంలో విభేదాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. శివ మరణవార్త తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అతడి మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇక, ఈ కేసులో నిందితుడిగా ఉన్న మణి పోలీసుల ముందు లొంగిపోయాడు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

రూ. 15వేల కోట్ల పెట్టుబ‌డి, 45 వేల‌కిపై ఉద్యోగాలు.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌రో దిగ్గజ సంస్థ
Vijaysai Reddy Sensational Comments On YS Jagan | Asianet Telugu