రేపల్లేలో వివాహితపై గ్యాంగ్ రేప్ ఘటనలో ముగ్గురు అరెస్ట్: ఎస్పీ వకుల్ జిందాల్

By narsimha lode  |  First Published May 1, 2022, 4:28 PM IST

బాపట్ల జిల్లాలోని రేపల్లె రైల్వే స్టేషన్ లో వివాహితపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. 
 



రేపల్లె: బాపట్ల జిల్లాలోని రేపల్లె రైల్వే స్టేషన్ లో వివాహితపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్టుగా జిల్లా ఎస్పీ Vakul Jindal  తెలిపారు. ముగ్గురు నిందితుల్లో ఒకరు మైనర్ అని ఎస్పీ వివరించారు. విజయ కృష్ణ, నిఖిల్ తో పాటు మరో మైనర్ ను కూడా ఈ కేసులో అరెస్ట్ చేశామని ఎస్పీ చెప్పారు.

ఆదివారం నాడు ఆయన Repalleలో మీడియాతో మాట్లాడారు. కృష్ణా జిల్లా Avanigaddaలో పని చేసేందుకు ప్రకాశం జిల్లా నుండి భార్యాభర్తలు వచ్చారని ఎస్పీ చెప్పారు. రేపల్లేలో రాత్రి పూట రైలు దిగారన్నారు. అయితే రాత్రిపూట ఆవనిగడ్డకు వెళ్లేందుకు బస్సులు లేకపోవడంతో రేపల్లేలోనే వారు ఉండిపోయారని  SP చెప్పారు. అయితే రాత్రిపూట స్టేషన్ లోని ఫ్లాట్ ఫామ్ ఆవరణలోని బల్లపై పడుకున్నారు. అయితే ముగ్గురు నిందితులు రైల్వే స్టేషన్ కు వచ్చి బాదితురాలి భర్తను టైమ్ అడిగారు. అతని వద్ద వాచీ లేదన్నాడు. దీంతో అతడిని కొట్టారు. అతని వద్ద ఉన్న రూ. 750 తీసుకున్నారు. భర్తను నిందితులు కొడుతుండగా బాధితురాలు అడ్డుకొనే ప్రయత్నం చేసింది. దీంతో ఆమెపై దాడి చేశారు. ఆమెను పక్కకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే ఆ సమయంలో రైల్వే స్టేషన్ లో ఉన్న మహిళలను బాధితురాలి భర్త సహాయం కోరాడు. అయితే వారు తాము ఏమీ చేయలేని నిస్సహాయతను వ్యక్తం చేశారని ఎస్పీ వివరించారు. Railway SSatiton కు సమీపంలోని 300 మీటర్ల దూరంలో పోలీస్ స్టేషన్ ఉందని చెప్పడంతో బాధితురాలి భర్త పోలీస్ స్టేషన్ కు వచ్చి సమాచారం ఇచ్చాడు. వెంటనే పోలీసులు రైల్వే స్టేషన్ కు రావడంతో పోలీసులు పారిపోయారని ఎస్పీ జిందాల్ తెలిపారు.

Latest Videos

రేపల్లే నుండి జిల్లాలోని ఇతర ప్రాంతాలకు వెళ్లే మార్గాల్లో తనిఖీలు చేపట్టినట్టుగా పోలీసులు తెలిపారు.  రైల్వే స్టేషన్ లోని ఆధారాలను బట్టి నిందితులను  గుర్తించామన్నారు.  నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చామన్నారు.  నిందితుల్లో ఒకరిపై చోరీ కేసు గతంలో నమోదైందని ఎస్పీ వివరించారు. టెక్నికల్ ఎవిడెన్స్  కోసం ఆధారాలను సేకరిస్తున్నామని ఎస్పీ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి త్వరలోనే చార్జీషీట్ ను దాఖలు చేస్తామన్నారు. నిందితుల్లో ఒకరు మైనర్ కూడా ఉన్నారని ఎస్పీ తెలిపారు.

ఇదిలావుంటే పల్నాడు జిల్లా గురుజాల రైల్వేస్టేషన్లో ఇలాగే వివాహితపై అత్యాచారానికి పాల్పడ్డారు దుండగులు. మూడేళ్ల కొడుకుతో ఒంటరిగా వున్న ఒడిషా మహిళపై గుర్తుతెలియని దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అతి దారుణంగా లైంగికదాడికి పాల్పడటంతో అపస్మారక స్థితిలో పడివున్న మహిళను గుర్తించిన కొందరు హాస్పిటల్ కు తరలించారు. 

 ఇక గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలోని శృంగారపురం గ్రామానికి ఇతర ప్రాంతాల నుండి కూలీపనుల కోసం వచ్చిన ఓ మహిళ ఆలయంలో నిద్రిస్తుండగా కొందరు యువకులు అఘాయిత్యానికి యత్నించారు. నిద్రిస్తున్న మహిళను దగ్గర్లోని తోటలోకి లాక్కెళ్లి అత్యాచారానికి ప్రయత్నించగా ఆమె గట్టిగా అరిచింది. దీంతో భయపడిపోయిన యువకులు పరారయ్యారు. యువతి కుటుంబసభ్యుల పిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకులను అరెస్ట్ చేశారు.

ఇక తుమ్మపూడిలో వివాహిత హత్య సంచలనం సృష్టించింది. మహిళపై అత్యాచారం జరిపి హత్య చేసినట్లు ప్రచారం జరగ్గా గుంటూరు ఎస్పీ సంచలన విషయాలు బయటపెట్టాడు. మహిళపై అత్యాచారం జరగలేదని... ఇది వివాహేతర సంబంధం కారణంగా జరిగిన హత్యగా గుంటూరు అర్భన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తెలిపారు. 

click me!