విశాఖ అదానీ గంగవరం పోర్టు వద్ద కార్మికుల ఆందోళన: ఆర్డీఓ చర్చలు, కొనసాగుతున్న ఉద్రిక్తత

By narsimha lodeFirst Published Aug 17, 2023, 12:35 PM IST
Highlights

విశాఖపట్టణం గంగవరం పోర్టుకు చెందిన  కార్మికులతో  ఆర్డీఓ  చర్చలు జరుపుతున్నారు. కనీస వేతనాలు ఇవ్వాలని కోరుతూ  కార్మికులు 45 రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు.

విశాఖపట్టణం:అదానీ గంగవరం పోర్టు  వద్ద ఆందోళన చేస్తున్న కార్మికులతో చర్చలు జరిపేందుకు ఆర్డీ ఓ హుస్సేస్ సాహెబ్  పోర్టు వద్దకు చేరుకున్నారు.అదానీ గంగవరం పోర్టులో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్  చేస్తూ  కార్మిక సంఘాల ఆధ్వరంలో  ఇవాళ  అదానీ గంగవరం పోర్టు ముట్టడికి పిలుపునిచ్చారు.కార్మిక సంఘాల ఆందోళన నేపథ్యంలో  గంగవరం పోర్టు వద్ద  పోలీసులు భారీగా  బందోబస్తు ఏర్పాటు  చేశారు.   పోర్టు గేటు వద్ద  పోలీసులు ఏర్పాటు చేసిన ముళ్లకంచెను దాటుకుని వెళ్లేందుకు కార్మికులు ప్రయత్నించారు.ఈ సమయంలో పోలీసులు నిరసనకారులను అడ్డుకున్నారు.ఈ క్రమంలోనే  పోలీసులు, కార్మికుల మధ్య తోపులాట చోటు  చేసుకుంది. ఈ క్రమంలో పలువురు కార్మికులు, పోలీసులకు గాయాలయ్యాయి. 

also read:విశాఖ అదానీ గంగవరం పోర్టు వద్ద ఉద్రిక్తత: పోలీసులు, కార్మికుల మధ్య తోపులాట

పోర్టు సమీపంలోని రోడ్డుపై కార్మికులు బైఠాయించారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.  ఇదిలా ఉంటే  కార్మికుల డిమాండ్లకు  రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి.  కార్మికుల ఆందోళనలకు  మాజీ ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించాయి. గత  45 రోజులుగా గంగవరం పోర్టులో పనిచేసే కార్మికులు  ఆందోళనలు నిర్వహిస్తున్నారు.   ఈ ఆందోళనలతో ఉద్రిక్తతలు చోటు  చేసుకున్నాయి.  ఈ విషయం తెలుసుకున్న  ఆర్డీఓ హుస్సేన్ సాహెబ్  అక్కడికి చేరుకొని కార్మికులతో చర్చిస్తున్నారు.

click me!