తిరుపతి జిల్లాలోని తలకోన జలపాతంలో మునిగి కర్ణాటకకు చెందిన యువకుడు మృతి చెందాడు. ఇన్ స్టా రీల్స్ కోసం వీడియో రికార్డు కోసం జలపాతంలో యువకుడు దూకిన సమయంలో మృతి చెందాడు.
తిరుపతి: జిల్లాలోని తలకోన జలపాతంలో మునిగి కర్ణాటకకు చెందిన యువకుడు సుమంత్ మృతి చెందాడు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం సుమంత్ జలపాతంలో దూకిన సమయంలో ప్రమాదవశాత్తు బండరాళ్ల మధ్య చిక్కుకుని మృతి చెందాడు. ఈ జలపాతంలో ఈ తరహాలో ముగ్గురు మృతి చెందారు. తలకోన జలపాతంలో ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
కర్ణాటక మంగుళూరుకు చెందిన సుమంత్ తన స్నేహితులతో కలిసి తిరుపతి జిల్లాలోని తలకోన జలపాతానికి శుక్రవారంనాడు చేరుకున్నారు. తలకోన జలపాతంలో ఈత కొడుతూ సేదతీరారు. ఆ తర్వాత ఇన్ స్టా రీల్స్ కోసం జలపాతంలో పై నుండి దూకే సమయంలో వీడియో తీయాలని సన్నిహితులకు సూచించారు. సుమంత్ జలపాతంలో దూకే సమయంలో స్నేహితులు వీడియో తీశారు.
జలపాతంలో దూకిన సమయంలో బండరాళ్ల మధ్య చిక్కుకుని సుమంత్ మృతి చెందాడు. జలపాతంలో దూకిన స్నేహితుడు పైకి రాకపోవడంతో స్నేహితులు అతని కోసం జలపాతంలో వెతికారు. శనివారం నాడు తెల్లవారుజామున సుమంత్ మృతదేహం నీళ్లపైకి వచ్చింది. తమ కళ్లముందే సుమంత్ చనిపోవడంతో అతని స్నేహితులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.