కొలువు కావాలంటే కోరిక తీర్చాల్సిందే.. లోబరుచుకుని, పదేపదే అత్యాచారం: యువతి వీడియో వైరల్

Siva Kodati |  
Published : Jun 12, 2021, 07:39 PM IST
కొలువు కావాలంటే కోరిక తీర్చాల్సిందే.. లోబరుచుకుని, పదేపదే అత్యాచారం: యువతి వీడియో వైరల్

సారాంశం

పశ్చిమ గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతానికి చెందిన ఒక గిరిజన అధికారి తనకు ఉద్యోగం ఇప్పిస్తాను అని చెప్పి శారీరకంగా వాడుకున్నారంటూ ఓ మహిళ చేసిన ఆరోపణలు కలకలం సృష్టిస్తున్నాయి.

పశ్చిమ గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతానికి చెందిన ఒక గిరిజన అధికారి తనకు ఉద్యోగం ఇప్పిస్తాను అని చెప్పి శారీరకంగా వాడుకున్నారంటూ ఓ మహిళ చేసిన ఆరోపణలు కలకలం సృష్టిస్తున్నాయి. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేసింది. తాను టిటిసి పూర్తి చేయడంతో ఉద్యోగం వస్తుందని ఇద్దరు వ్యక్తులు నమ్మించి సదరు అధికారి వద్దకు తీసుకెళ్లారని ఆమె చెప్పారు. తన పరిస్ధితిని అదునుగా చేసుకున్న అధికారి తనను శారీరకంగా లోబరచుకున్నారని ఆరోపించింది.

తనతో కోరికలు తీర్చుకుని ఉద్యోగం ఇవ్వలేదని.. దీనిపై అడిగేందుకు వెళ్లిన ప్రతిసారీ మళ్లీ కోరిక తీర్చాలని వేధింపులకు గురిచేస్తున్నట్లు ఆమె సంచలన ఆరోపణలు చేసింది. తాను మోసపోయానని గ్రహించి మరొక మహిళకు అన్యాయం జరగకూడదని ఈ వీడియో విడుదల చేస్తున్నట్లు చెప్పింది. తనకు న్యాయం జరిగేవరకు వీడియో సీఎం వరకు వెళ్లేదాకా అందరూ షేర్ చెయ్యాలంటూ బాధిత మహిళ కోరింది. ప్రస్తుతం ఈ వ్యవహారం ఏజెన్సీలో హాట్ టాపిక్‌గా మారింది.

Also Read:పదేళ్ల బాలికపై, మైనర్ల సామూహిక అత్యాచారం.. వీడియో తీసి..

అయితే  ఈ వ్యవహారాన్ని గుట్టుచప్పుడు కాకుండా సద్దుమణిగించేందుకు అధికార పార్టీ నేతలతో పాటు పలువురు అధికారులు రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది. ఒక కీలక పోలీస్ అధికారి సైతం మహిళతో రాజీ కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్