ఏపీ కరోనా అప్‌డేట్స్: 6 వేలకు పడిపోయిన కేసులు.. ప్రకాశంలో అనూహ్యంగా పెరిగిన మరణాలు

Siva Kodati |  
Published : Jun 12, 2021, 06:00 PM IST
ఏపీ కరోనా అప్‌డేట్స్: 6 వేలకు పడిపోయిన కేసులు.. ప్రకాశంలో అనూహ్యంగా పెరిగిన మరణాలు

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల్లో భారీ తగ్గుదల కనిపిస్తోంది. 6 వేల దిగువకు కేసులు పడిపోయాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 6,592 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల్లో భారీ తగ్గుదల కనిపిస్తోంది. 6 వేల దిగువకు కేసులు పడిపోయాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 6,592 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 18,03,074కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 58 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 11,882కి చేరుకుంది.

గత 24 గంటల వ్యవధిలో కోవిడ్ బారినపడి విజయనగరం 2, ప్రకాశం 11, అనంతపురం 5, తూర్పుగోదావరి 6, చిత్తూరు 9, గుంటూరు 2, కర్నూలు 3, నెల్లూరు 1, కృష్ణ 5, విశాఖపట్నం 5, శ్రీకాకుళం 4, పశ్చిమ గోదావరి 4  కడపలో ఒక్కరు చొప్పున మరణించారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 11,577 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 16,99,775కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 1,08,616 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 2,03,48,106కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 91,417 మంది చికిత్స పొందుతున్నారు.

నిన్న ఒక్కరోజు అనంతపురం 550, చిత్తూరు 1199, తూర్పుగోదావరి 1167, గుంటూరు 426, కడప 456, కృష్ణ 392, కర్నూలు 251, నెల్లూరు 228, ప్రకాశం 552, శ్రీకాకుళం 383, విశాఖపట్నం 436, విజయనగరం 249, పశ్చిమ గోదావరిలలో 663 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.

 

PREV
click me!

Recommended Stories

నన్ను సార్ అంటే చాక్లెట్ ఇవ్వాలి విద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Nara Lokesh Fun With Students
Nara Lokesh Speech: టీడీపీ కార్యకర్తలకు పూనకాలు తెప్పించే నారాలోకేష్ పవర్ ఫుల్ స్పీచ్ | TDP