
విజయవాడలో యువతి మృతి కలకలం రేపుతోంది. ఛార్టెడ్ అకౌంటెంట్ చెరుకూరి సింధు అనుమానాస్పద స్థితిలో ఉరికి వేలాడుతూ కనిపించింది. ఆమెతో సన్నిహితంగా వుంటున్న ప్రసేన్ అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడినట్లుగా మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఆమె ముఖంపై గాయాలు వుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రసేన్ - సింధు ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. లాక్‌డౌన్ తర్వాత సింధు.. ప్రసేన్‌కు చెందిన ఇంట్లో ఉంటోంది. అయితే నిన్నటి నుంచి ఆమె ఫోన్ ఎత్తకపోవడంతో ప్రసేన్‌కు ఫోన్ చేశారు సింధు తల్లిదండ్రులు. దాంతో సింధు వున్న ఇంటికి వెళ్లాడు ప్రసేన్. సింధు ఆత్మహత్య చేసుకుంది అతను వారితో చెప్పాడు. ఆమె పేరెంట్స్ వెళ్లి చూడగా.. మొహం మీద గాయాలు వున్నట్లుగా గుర్తించారు. ప్రసేన్ హత్య చేశాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.