రాహుల్ హత్య కేసు: పంజాగుట్ట మర్డర్ తరహాలో ప్లాన్.. కోగంటి సత్యం చుట్టూ బిగుస్తోన్న ఉచ్చు

Siva Kodati |  
Published : Aug 21, 2021, 06:46 PM ISTUpdated : Aug 21, 2021, 06:59 PM IST
రాహుల్ హత్య కేసు: పంజాగుట్ట మర్డర్ తరహాలో ప్లాన్.. కోగంటి సత్యం చుట్టూ బిగుస్తోన్న ఉచ్చు

సారాంశం

బెజవాడలో సంచలనం సృష్టించిన వ్యాపారవేత్త రాహుల్ హత్య కేసులో కోగంటి సత్యం పాత్రపై పోలీసులు ఫోకస్ పెట్టారు. ప్రధాన నిందితుడు దొరికితే కోగంటి సత్యం పాత్రపై క్లారిటీ వస్తుందని పోలీసులు భావిస్తున్నారు. హత్య వెనుక మాస్టర్ ప్లాన్ అంతా కోగంటి టీమ్‌దేగా భావిస్తున్నారు. పంజాగట్ట మర్డర్ తరహాలో హత్య సీన్‌లో లేకుండా కోగంటి ప్లాన్ చేశారు. 

బెజవాడలో సంచలనం సృష్టించిన వ్యాపారవేత్త రాహుల్ హత్య కేసులో కోగంటి సత్యం పాత్రపై పోలీసులు ఫోకస్ పెట్టారు. ఈ సందర్భంగా సంచలనం విషయాలు వెలుగులోకి వచ్చాయి. రూ.15 కోట్ల విలువ చేసే జిక్సన్ కంపెనీలో 30 శాతం వాటాపై గొడవలు జరిగినట్లుగా తెలుస్తోంది. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్నారు కోరాడ విజయ్ కుమార్. డబ్బుల కోసం రాహుల్‌పై తీవ్ర ఒత్తిడి చేశాడు విజయ్ కుమార్. ప్రధాన నిందితుడు దొరికితే కోగంటి సత్యం పాత్రపై క్లారిటీ వస్తుందని పోలీసులు భావిస్తున్నారు. హత్య వెనుక మాస్టర్ ప్లాన్ అంతా కోగంటి టీమ్‌దేగా భావిస్తున్నారు. పంజాగట్ట మర్డర్ తరహాలో హత్య సీన్‌లో లేకుండా కోగంటి ప్లాన్ చేశారు. 

రాహుల్ విజయవాడలో హత్యకు గురైన విషయం తెలిసిందే. అతని మృతదేహం కారులో పడి ఉంది. ఆ మృతదేహాన్ని రాహుల్ దిగా గుర్తించిన తర్వాత పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో కోరాడ విజయ్ కుమార్ ను ప్రధాన సూత్రధారిగా పోలీసులు భావిస్తున్నారు. అతను ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

Also Read:రాహుల్ హత్య కేసు: వెలుగులోకి కొత్త విషయాలు.. కోరాడ ఫ్యామిలీపై మృతుడి తండ్రి ఆరోపణలు

ఆర్థిక లావాదేవీలకు సంబంధించి రాహుల్ కు, విజయ్ కుమార్ కు మధ్య వివాదం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై పలుసార్లు పంచాయతీ కూడా జరిగిందని చెబుతున్నారు. ఈ వివాదం కారణంగానే విజయ్ కుమార్ రాహుల్ హత్యకు ప్రణాళిక రచించి అమలు చేసినట్లు తెలుస్తోంది. రాహుల్ ఫిర్యాదు మేరకు పోలీసులు గాయత్రి, పద్మశ్రీ అనే ఇద్దరు మహిళలపై కూడా కేసు నమోదు చేశారు. రాహుల్ హత్య చిక్కుముడిని విప్పేందుకు పోలీసులు పలువురిని విచారిస్తున్నారు. రాహుల్ హత్యతో తనకు సంబంధం లేదని కోగంటి సత్యం ఇప్పటికే స్పష్టం చేశారు. 

PREV
click me!

Recommended Stories

Bhumana Karunakar Reddy Comments: తిరుమలలో మద్యం సీసాల అంశంపై భూమన ఫైర్ | Asianet News Telugu
Bhogapuram International Airport: భోగాపురం విమానాశ్రయంలో అడుగుపెట్టిన తొలి విమానం| Asianet Telugu