కిరాతకం: యువకున్ని చంపి... చేతులు నరికి బస్తాలో వేసుకుని వెళ్తూ...

Arun Kumar P   | Asianet News
Published : Mar 31, 2021, 04:05 PM ISTUpdated : Mar 31, 2021, 04:09 PM IST
కిరాతకం: యువకున్ని చంపి... చేతులు నరికి బస్తాలో వేసుకుని వెళ్తూ...

సారాంశం

గుంటూరు జిల్లా పెదకాకాని మండలం రామచంద్రాపురంలో ఓ యువకుడు అత్యంత కిరాతకంగా హత్యకు గురయ్యాడు. 

గుంటూరు: ఓ వ్యక్తిని అత్యంత కిరాతకంగా హతమార్చడమే కాకుండా... మృతదేహం చేతులను నరికి తీసుకువెళుతూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు దుండగులు. ఈ దారుణం గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.  

గుంటూరు జిల్లా పెదకాకాని మండలం రామచంద్రాపురంలో ఓ యువకుడి హత్య జరిగింది. యువకుడిని అత్యంత కిరాతకంగా నరికి చంపారు దుండగులు. అంతటితో ఆగకుండా ప్రాణాలు కోల్పోయిన తర్వాత కూడా మృతదేహం నుండి శరీర బాగాలను వేరు చేశారు. ఇలా చేతులను కూడా నరికి ఓ బస్తాలో వేసుకుని వెళ్లారు దుండగులు. 

అయితే నల్లపాడు పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తూ ఈ దుండగులను కూడా ఆపారు. వారి ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించడంతో చేతిలో వున్న సంచిన ఓపెన్ చేసిన పోలీసులు అవాక్కయ్యారు. సంచిన మనిషి చేతులు వుండటంతో వారిని అందుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో విచారించగా  అసలు నిజాన్ని ఒప్పుకున్నారు.

దీంతో నిందితులతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే మృతదేహంతో పాటు నిందితుల వద్ద లభించిన చేతులను కూడా ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. 


 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్