వైసీపీలో ప్రాధాన్యత లేదు.. కన్నీళ్లు పెట్టుకున్న మహిళా నేత

Published : Feb 12, 2019, 01:57 PM IST
వైసీపీలో ప్రాధాన్యత లేదు.. కన్నీళ్లు పెట్టుకున్న మహిళా నేత

సారాంశం

వైసీపీలో మహిళలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ చిత్తూరు జిల్లా మహిళా సేవాదళ్ కార్యదర్శి సుహాసినీ రెడ్డి ఆరోపించారు. 

వైసీపీలో మహిళలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ చిత్తూరు జిల్లా మహిళా సేవాదళ్ కార్యదర్శి సుహాసినీ రెడ్డి ఆరోపించారు. జగన్ మీద అభిమానంతో తాను పార్టీ పెట్టిన వెంటనే వైసీపీలో చేరానని చెప్పారు. అలాంటి తనకు కనీస ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆమె భావోద్వేగానికి గురయ్యారు.

గతంలో టీడీపీలో ఉండి.. అక్కడ టికెట్ దొరకక.. వైసీపీలో చేరిన వారికి మాత్రం ప్రాధాన్యత ఇస్తున్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.  పార్టీ కోసం తాను కుటుంబానికి కూడా దూరమయ్యానని.. పార్టీ కార్యక్రమాలకు లక్షల రూపాయలు ఖర్చుచేశానని ఆమె చెప్పారు. అయినప్పటికీ తనను గుర్తించడం లేదన్నారు.

జగన్ సీఎం కావాలని తాను పార్టీ కోసం కృషి చేస్తున్నానని చెప్పారు. అలాంటి తనను వేరే పార్టీకి సహకరిస్తోందంటూ ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు