కుప్పంలో వైసిపిదే విజయం... చంద్రబాబుది ఆడలేక మద్దెల ఓడు: మంత్రి బొత్స సంచలనం

By Arun Kumar PFirst Published Nov 16, 2021, 2:46 PM IST
Highlights

కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో వైసిపి విజయం ఖాయమని మంత్రి బొత్స సత్యనారాయణ ధీమా వ్యక్తం చేసారు. ఎలాగూ ఓడిపోతారని తెలిసే ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుగా చంద్రబాబు మాట్లాడుతున్నారని అన్నారు. 

అమరావతి: టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలోనే ఓడించడం ఖాయమని మునిసిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సోమవారం జరిగిన కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో అధికార వైసిపి దే గెలుపని మంత్రి ధీమా వ్యక్తం చేసారు. 

kuppam municipal election లో  వైసిపి అక్రమాలకు పాల్పడిందంటూ chandrababu naidu తో పాటు ఇతర నాయకులు చేస్తున్న ఆరోపణలను బొత్స తిప్పికొట్టే ప్రయత్నం చేసారు. చంద్రబాబు తన స్థాయిని దిగజార్చుకునేలా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. ఆడలేక మద్దెల ఓడు అన్నట్టుగా ఆయన తీరు వుందన్నారు మంత్రి. 

ఎలాగూ ఓడిపోతామని తెలుసు కాబట్టే అధికార YSRCP దొంగ ఓట్లు వేయించిందని, అల్లర్లకు పాల్పడ్డారంటూ పనికిమాలిన ఆరోపణలు చేస్తున్నారని botsa satyanarayana మండిపడ్డారు. పోలింగ్ సిబ్బంది, పోలీసుల సాయంతో తాము అక్రమాలకు పాల్పడ్డామంటున్న టిడిపి ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదన్నారు. దొంగ ఓట్ల సంస్కృతి ఎవరిదో అందరికి తెలుసని బొత్స పేర్కొన్నారు. 

read more  దొంగ ఓట్ల కల్చర్‌ టీడీపీదే... ఆధారాలివే..: ఎస్ఈసికి వైసిపి ఎమ్మెల్సీ అప్పిరెడ్డి ఫిర్యాదు
 
వైసిపి ప్రభుత్వం కుప్పంకి నీళ్ళు ఇవలేదని అనడానికి అసలు చంద్రబాబుకు సిగ్గుందా? గత నలబై ఏళ్లుగా కుప్పం ఎమ్మెల్యే ఎవరు? అధికారంలో వుండగా మీ సొంత నియోజకవర్గ సమస్యలనే పట్టించుకోని మీరు మమ్మల్ని విమర్శిస్తారా? అంటూ బొత్స విరుచుకుపడ్డారు.

ఇక మూడు రాజధానుల నిర్మాణం cm ys jaganmohan reddy మూడు జన్మలెత్తినా సాధ్యంకాదన్న మాజీ మంత్రి nara lokesh వ్యాఖ్యలపై కూడా బొత్స స్పందించారు. ముమ్మాటికీ మూడు రాజధానుల నిర్ణయాన్ని అమలు చేస్తామన్నారు. ఎవ్వరూ మూడు రాజధానులను ఆపలేరన్నారు. అడ్డుకోవడానికి ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా జగన్ సర్కార్ వెనక్కి తగ్గబోదని... సాంకేతిక సమస్యలన్నింటిని పరిష్కరిస్తామని మంత్రి బొత్స స్పష్టం చేసారు. 

అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్రపైనా బొత్స సంచలన వ్యాఖ్యలు చేసారు. ప్రస్తుతం పెయిడ్ ఆర్టిస్టులతో పాదయాత్ర జరుగుతోందన్నారు. అసలు లోకేష్ కు బుర్ర ఉందా... ఆయినా ఆయనకు సమాధానం కూడా చెప్పే అవసరం తనకు లేదన్నారు. లోకేష్ ఎన్ని జన్మలెత్తినా ఎమ్మెల్యే అవ్వగలడా... అంటూ బొత్స ఎద్దేవా చేసారు. 

read more  చంద్రబాబు కుప్పం కోట బద్దలైంది: ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల

చంద్రబాబుకి అసలు ఆంధ్రప్రదేశ్ లో ఇల్లు లేదు... కనీసం ఓటు కూడా లేదు. అలాంటిది ఆయన రాష్ట్ర ప్రజలను వంచించడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయనదంతా దగా, మోసం చేసే పద్దతే. కాబట్టి ప్రజలెవ్వరూ చంద్రబాబు మాటలను నమ్మవద్దని మంత్రి బొత్ససత్యనారాయణ పేర్కొన్నారు. 

ఇక ఇప్పటికే కుప్పంలో అధికార వైసిపి దొంగఓట్లు వేయిస్తోందన్న చంద్రబాబు వ్యాఖ్యలపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా స్పందించారు. వైసీపీ ఎప్పుడూ దిగజారుడు రాజకీయాలు చేయలేదని ఆయన అన్నారు. అయినా దొంగ ఓట్లు వేయడం ఎలా సాధ్యమౌతుందని ప్రశ్నించారు. కుప్పంలో  వైసిపి దొంగ ఓట్లు వేయిస్తోందని చంద్రబాబు చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. టీడీపీ ఇప్పటికే కాడి పడేసిందని...అందుకే ఓటమికి కారణాలను వెతుక్కునే పనిలో పడిందన్నారు. 

click me!