2019 ఎన్నికల్లో గెలుపుకు మాస్టర్ ప్లాన్..ఏంటో తెలుసా ?

Published : Dec 26, 2017, 08:44 AM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
2019 ఎన్నికల్లో గెలుపుకు మాస్టర్ ప్లాన్..ఏంటో తెలుసా ?

సారాంశం

వచ్చే ఎన్నికల్లో అధికారం అందుకునేందుకు వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మాస్టర్ ప్లాన్ వేసినట్లే కనబడుతోంది.

వచ్చే ఎన్నికల్లో అధికారం అందుకునేందుకు వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మాస్టర్ ప్లాన్ వేసినట్లే కనబడుతోంది. వచ్చే ఎన్నికల్లో అధికారం అందుకోవటం రెండు ప్రధాన పార్టీల అధినేతలకు ఎంత కీలకమో అందరికీ తెలిసిందే. అందుకే అధికారంలోకి రావటానికి జగన్, అధికారాన్ని నిలుపుకునేందుకు చంద్రబాబునాయుడు తీవ్ర ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అందులో భాగంగానే జగన్ పాదయాత్ర మొదలుపెట్టేసారు. అందులోనూ రూరల్ నియోజకవర్గాలపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. జరుగుతున్న పాదయాత్రను గమనిస్తే ఆ విషయం స్పష్టంగా అర్ధమవుతుంది.

కడపజిల్లాలో మొదలైన పాదయాత్ర అనంతపురం జిల్లా చివరిదశకు వచ్చేసింది. ప్రస్తుతం కదిరి నియోజకవర్గంలో ఉన్న జగన్ 26వ తేదీన చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోకి ప్రవేశిస్తున్నారు. కడప, కూర్నలు జిల్లాలైనా లేదా  అనంతపురం జిల్లాలో పాదయాత్రను తీసుకున్నా మొత్తం రూరల్ నియోజకవర్గాల్లోనే ఎక్కవుగా జరిగింది. ఎందుకంటే, రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో సుమారు 110 గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉండే నియోజకవర్గాలే.

వైసిపికి మొదటినుండి పట్టణ ప్రాంతాలతో పోల్చుకుంటే గ్రామీణ ప్రాంతాల్లోనే పట్టెక్కువ అని వైసిపి నేతలే చెబుతున్నారు. మొన్న జరిగిన నంద్యాల ఉపఎన్నికలో కూడా వైసిపికి రూరల్ మండలాల్లోనే ఓట్లు బాగా వచ్చిన సంగతిని వైసిపి నేతలు గుర్తు చేస్తున్నారు. అందుకే జగన్ కూడా రూరల్ ఏరియాలెక్కువుండే నియోజకవర్గాలకే ప్రాధాన్యత ఇచ్చారు. దాంతో పాదయాత్ర రూటు మ్యాప్ కూడా అదే విధంగా తయారుచేసారు.

కడప జిల్లాలోని 10 నియోజవకర్గాల్లో 7 నియోజకవర్గాలను కవర్ చేసారు. అలాగే, కర్నూలు జిల్లాలోని 14 నియోజకవర్గాలని 10 నియోజకవర్గాల్లో పాదయాత్ర జరిగింది. ప్రస్తుతం అనంతపురం జిల్లాలోని 14 నియోజవకర్గాల్లో కూడా జగన్ యాత్రలో రూరల్ నియోజవకర్గాలే ఉన్నాయి. జిల్లాలోని గుత్తి, తాడిపత్రి, శింగనమల, ఉరవకొండ, అనంతపురం అర్బన్, రాప్తాడు, ధర్మవరం, పుట్టపర్తి, కదిరి నియోజకవర్గాలను జగన్ కవర్ చేసారు. తాడిపత్రిలో జగన్ బహిరంగ సభకు ఎంతటి అనూహ్య స్పందన కనిపించిందో కదిరి నియోజవకర్గంలో జరిగిన బహిరంగసభ ఫినిషింగ్ టచ్ కూడా అంతే బ్రహ్మాండగా ఉంది. చిత్తూరులో ఎలా జరుగుతుందో చూడాలి.

PREV
click me!

Recommended Stories

Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu
YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu