జగన్ మీద పోరు: కేంద్ర మంత్రులతో రఘురామ కృష్ణమ రాజు భేటీలు

By telugu teamFirst Published Jun 27, 2020, 11:59 AM IST
Highlights

వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణమ రాజు పార్టీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మీద తన పోరును ఉధృతం చేశారు. ఇందులో భాగంగా ఆయన కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, కిషన్ రెడ్డిలను కలిశారు.

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైఎస్ జగన్ మీద పోరాటంలో భాగంగా పార్టీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణమ రాజు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు. ఆ తర్వాత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డితో సమావేశమయ్యారు. రాజ్ నాథ్ సింగ్ ను తాను మర్యాదపూర్వకంగా మాత్రమే కలుసుకున్నట్లు రఘురామకృష్ణమ రాజు  చెప్పారు. 

తనకు రక్షణ కల్పించాలంటూ ఆయన ఇది వరకే లోకసభ స్పీకర్ ఓంబిర్లాకు లేఖ రాసిన విషయం తెలిసిందే. శుక్రవారంనాడు ఆయన ఓంబిర్లాను కూడా కలిశారు. వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి తనకు షోకాజ్ నోటీసు జారీ చేసిన నేపథ్యంలో ఆయన శుక్రవారం ఢిల్లీకి చేరుకున్నారు.  

Also Read: జగన్ పార్టీకే ఎసరు పెడుతున్న రఘురామకృష్ణమ రాజు: అసలేమవుతుంది?

తనకు ప్రాణహానీ ఉందని చెబుతూ తనకు రక్షణ కల్పించాలని ఆయన ఓంబిర్లాన కోరారు. అందుకు స్పీకర్ సానుకూలంగా స్పందించినట్లు చెబుతున్నారు. తనకు రక్షణ కల్పించాలని కోరడానికే ఆయన శుక్రవారం హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లాతో సమావేశమయ్యారు. ఐబీ నివేదిక రాగానే రక్షణ కల్పిస్తామని అజయ్ భల్లా రఘురామ కృష్ణమ రాజుకు హామీ ఇచ్చారు. 

తనకు వైఎస్ జగన్ అపాయింట్ మెంట్ దొరకడం లేదని చెబుతూ రఘురామ కృష్ణమ రాజు ప్రధానంగా విజయసాయి రెడ్డిని లక్ష్యం చేసుకుని విమర్శలు చేస్తున్నారు. విజయసాయి రెడ్డి తనకు జారీ చేసిన షోకాజ్ కు చట్టబద్ధత లేదని ఆయన చెప్పారు. 

Al;so Read: రఘురామ కృష్ణమరాజు వ్యూహం ఇదే: వైఎస్ జగన్ టార్గెట్

click me!