ఎస్పీవై రెడ్డి ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్: ఒకరి మృతి, మరింత మందికి అస్వస్థత

Published : Jun 27, 2020, 11:26 AM ISTUpdated : Jun 27, 2020, 12:05 PM IST
ఎస్పీవై రెడ్డి ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్: ఒకరి మృతి, మరింత మందికి అస్వస్థత

సారాంశం

రాజకీయ నాయకుడు ఎస్పీవై రెడ్డికి చెందిన ఫ్యాక్టరీలో గ్యాస్ లీకై ఒతకను మరణించాడు. కర్నూలు జిల్లాలోని నంద్యాలలో గల ఫ్యాక్టరీలో అమ్మోనియా లీకైంది. మరికొంత మంది అస్వస్థతకు లోనయ్యారు.

కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా నంద్యాలలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. రాజకీయ నేత ఎస్పీవై రెడ్డికి చెందిన ఫ్యాక్టరీలో గ్యాస్ లీకైంది. ఫ్యాక్టరీలో అమ్మోనియా లీకై ఒకతను మరణించాడు. 

ఈ ప్రమాదంలో మరింత మంది అస్వస్థతకు లోనయ్యారు. వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకున్నారు. అంబులెన్స్ కూడా వచ్చింది. గ్యాస్ లీకేజీతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో నలుగురు చిక్కుకున్నారు. .లోపల చిక్కుకున్నవారిని సురక్షితంగా బయటకు తీయడానికి సహాయక బృందాలు ప్రయత్నిస్తున్నాయి. 

ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుడిని శ్రీనివాస్ గా గుర్తించారు. ఫ్యాక్టరీ వెలుపల దాని వల్ల ప్రమాదం సంభవించే అవకాశం లేదని జిల్లా కలెక్టర్ చెప్పారు. అన్ని రకాల సురక్షిత చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

వివరాలు అందాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్
Bus Accident : అల్లూరి జిల్లాలో ఘోరం.. బస్సు ప్రమాదంలో 15మంది మృతి