ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద తీవ్రమైన ఆరోపణలు చేస్తూ వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణమ రాజు సెల్ఫీ వీడియోను విడుదలర చేశారు. జగన్ పుట్టిన రోజు వేడుకలకు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఏలూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకల కోసం వ్యాపారుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారంటూ వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణమ రాజు సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆయన సెల్ఫీ వీడియో విడుదల చేశారు.
"మీ పుట్టిన రోజు వేడుకల కోసం కొందరు వైసీపీ నేతలు వ్యాపారుల నుండి బలవంతంగా వసూలు చేస్తున్న జె టాక్స్ ఆపండి. కరోనా సమయములో వ్యాపారాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా వ్యాపారుల నుండి డబ్బులు వసూలు చేస్తున్న దుష్ట శక్తుల నుండి వ్యాపారులను కాపాడండి" అని ఆయన జగన్ ను కోరారు.
"మీ పుట్టినరోజు వేడుకల కోసం సొంత డబ్బులు గానీ ప్రభుత్వ డబ్బులు కానీ వాడండి వ్యాపారుల నుండి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్న దుష్ట శక్తుల వల్ల పార్టీ పరువు మీ పరువు పోయే ప్రమాదముంది. చిరు వ్యాపారులు పండ్ల వ్యాపారాల తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి పుట్టిన రోజు వేడుకల పేరుతో నేతల చేసున్న డబ్బులు వసూలు కార్యక్రమం ఆపండి" అని రఘురామకృష్ణమ రాజు అన్నారు.