డ్యాన్సర్ గాయత్రి ఆత్మహత్యలో ట్విస్ట్: వివాహేతర సంబంధమే...

Published : Dec 19, 2020, 04:48 PM ISTUpdated : Dec 19, 2020, 04:58 PM IST
డ్యాన్సర్ గాయత్రి ఆత్మహత్యలో ట్విస్ట్: వివాహేతర సంబంధమే...

సారాంశం

బెజవాడ డ్యాన్సర్ గాయత్రి ఆత్మహత్య కేసు మలుపు తిరిగింది. వివాహేతర సంబంధమే ఆమె ఆత్మహత్యకు కారణమని అనుమానిస్తున్నారు. నీలిమ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో గల వాంబే కాలనీలో ఆత్మహత్య చేసుకున్న డ్యాన్సర్ గాయత్రి కేసు మలుపు తీసుకుంది. వివాహేతర సంబంధమే ఆత్మహత్యకు కారణమని భావిస్తున్నారు.  30 ఏళ్ల గాయత్రి శనివారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. 

బన్నీ డ్యాాన్స్ గ్రూప్ లో ఉన్న నీలిమ భర్తతో గాయత్రి వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై  భార్య నీలిమ గాయత్రి ఇంటికి వచ్చి గొడవకు దిగింది. నీలిమ గాయత్రిని ప్రశ్నించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 

Also Read: బెజవాడలో డ్యాన్సర్ అనుమానాస్పద మృతి: మరణానికి ముందు యువతితో గొడవ

పరువు పోతుందని మనస్తాపానికి గురై గాయత్రి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయత్రితో గొడవ పడిన తర్వాత నీలిమ కనిపించకుండా పోయింది. ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

గొడవ పడి నీలిమ వెళ్లిపోయిన తర్వాత గాయత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆ సమయంలో గాయత్రి భర్త ఇంట్లో లేడు. ఆత్మహత్యకు ముందు తాను గాయత్రి ఇంటికి వెళ్లిన మాట వాస్తవమేనని నీలమ ఓ ప్రముఖ టీవీ చానెల్ ప్రతినిధితో చెప్పింది. తాను మామూలుగానే గాయత్రి ఇంటికి వెళ్లినట్లు తెలిపింది. ఆరు నెలల క్రితమే తాను తన భర్త బన్నీకి దూరంగా ఉండాలని గాయత్రికి చెప్పానని,, దానికి గాయత్రి కూడా అంగీకరించిందని ఆమె చెప్పింది. 

తన భర్త బన్నీతో కలిసి ఉండాలని కూడా తాను గాయత్రికి చెప్పానని, తాను విడిగా ఉంటానని చెప్పానని అందుకు ఆమె అంగీకరించలేదని నీలిమ చెప్పింది. ఈ విషయం తెలిసి గాయత్రిని భర్త సంతోష్ తీవ్రంగా కొట్టాడని, ఆ విషయం తనకు గాయత్రి ఫోన్ చేసి చెప్పిందని ఆమె వివవరించింది. గాయత్రి ఎందుకు ఆత్మహత్య చేసుకుందో పోలీసులు తేల్చాలని ఆమె అభిప్రాయపడింది.  డ్యాన్సర్ భర్తపై అనుమానం ఉందని చెప్పింది.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ కంటే హైదరాబాద్ లోనే లోయెస్ట్ టెంపరేచర్స్ .. స్కూల్ టైమింగ్స్ చేంజ్
YS Jagan Sensational Comments: మేము అధికారంలోకి వస్తే వాళ్లందరూ జైలుకే | Asianet News Telugu