ఒకే సామాజిక వర్గానికి పెద్ద పీట వేసి.. ఏ ముఖం పెట్టుకుని సామాజిక సాధికార సభలు నిర్వహిస్తారు?... రఘురామ

By SumaBala BukkaFirst Published Oct 28, 2023, 8:26 AM IST
Highlights

తమ పార్టీ నిర్వహిస్తున్న సామాజిక సాధికార సభలపై రఘురామ కృష్ణంరాజు విరుచుకుపడ్డారు. ఒకే సామాజిక వర్గానికి పెద్దపీట వేశారని విమర్శలు గుప్పించారు. 

ఢిల్లీ : వైసీపీ నేతలు నిర్వహిస్తున్న సామాజిక సాధికార యాత్రలు మూడో రోజుకు చేరుకున్నాయి. వైసిపి నేతలు చేస్తున్న సామాజిక సాధికార సభల మీద వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మండిపడ్డారు. ఢిల్లీలో శుక్రవారం రఘురామకృష్ణం రాజు విలేకరులతో మాట్లాడారు. ఒకే సామాజిక వర్గానికి పెద్ద పీట వేశారని… విమర్శించారు. తిరుపతిలో టీటీడీ చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి,  టీటీడీ ఈవోగా ధర్మారెడ్డి, జిల్లా కలెక్టర్ గా వెంకట రమణారెడ్డి, తుడా చైర్మన్ గా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి లను నియమించారు.  

అలా మొత్తం ఒకే సామాజిక వర్గానికి తమ పార్టీ నాయకత్వం పెద్ద పీట వేసిందన్నారు. ఇంతా చేసి తిరుపతిలో ఏ ముఖం పెట్టుకొని సామాజిక సాధికార సభలు నిర్వహిస్తారో చూడాలని అన్నారు. ఇంతే కాకుండా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా అజయ్ రెడ్డిని, మరో కార్పొరేషన్ కు రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తిని చైర్మన్గా నియమిస్తారని సమాచారం వచ్చిందని అన్నారు.  తమ పార్టీ అధినేత సొంత సామాజిక వర్గానికి కీలక పదవులు కట్టబెట్టారని.. ఇప్పుడేమో సామాజిక సాధికార యాత్ర పేరుతో మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణలను ప్రజల దగ్గరికి తిప్పితే.. వారు ఎందుకు వస్తారని ప్రశ్నించారు.

అలిపిరి - తిరుమల నడక మార్గంలో చిరుత, ఎలుగుబంటి కలకలం.. భక్తులను అప్రమత్తం చేసిన టీటీడీ

రాబోయే ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటున్న.. టిడిపి, జనసేన కూటమి ఘన విజయం సాధిస్తుందని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతుందో తెనాలి సామాజిక సాధికార సభ తేల్చిందని చెప్పుకొచ్చారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో కనిపించిన ఖాళీ కుర్చీలే దీనికి నిదర్శనం అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. కూటమిలో మూడో పార్టీ చేరేలా కృషి చేస్తున్నాడని.. ఆయన కృషితో మూడో పార్టీ చేరే అవకాశాలు ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కూటమిలో ఆ పార్టీ కనక చేరితే అధికార వైసీపీ అరాచకాలకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉందన్నారు.

click me!