‘చంద్రబాబు కమీషన్లు పుచ్చుకుంటాడు..’

First Published Apr 23, 2018, 3:07 PM IST
Highlights

చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసిన జగన్

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, అతని కుమారుడు లోకేష్ లు కమిషన్లు పుచ్చుకుంటారని ఆరోపించారు. ప్రస్తుతం ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా విజయవాడలో ఉన్న జగన్.. సోమవారం మీడియాతో
మాట్లాడారు. చంద్రబాబు గుడిని, గుడిలో లింగాన్ని మింగగలవాడని జగన్ విమర్శించారు.

రు-చెట్టు పథకం కింద టీడీపీ నేతలు కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారని మండిపడ్డారు. కింది స్థాయి నుంచి ఏపీ మంత్రి నారా లోకేష్, సీఎం చంద్రబాబు వరకు కమీషన్లు వెళ్తున్నాయంటూ విమర్శలు చేశారు. ప్రజలు వ్యతిరేకిస్తున్నా టీడీపీ నేతలు దుర్మార్గంగా మట్టిని తరలిస్తున్నారని పేర్కొన్నారు. టీడీపీ నేతల అక్రమాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే.. మట్టి తవ్వేందుకు దేవాలయం అడ్డు వస్తుందని అందులో ఉన్న విగ్రహాలను రాత్రికి రాత్రే తరలించారని గుర్తుచేశారు. రాష్ట్రంలో ప్రతి చెరువు పరిస్థితి ఇలానే ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

'మట్టితో వ్యాపారం ఎలా చేయాలో చంద్రబాబుకు బాగా తెలుసు. ఆయన ఏపీలో అదేపని చేసి చూపిస్తున్నారు. సీఎం క్యాంప్ ఆఫీస్‌కి 35 కిలోమీటర్ల దూరంలో ఇసుక వ్యాపారం జరుగుతుంటే.. ఇక రాష్ట్రం ఎలా బాగుపడుతుంది. చివరికి దేవుళ్లను కూడా గుళ్లలో ఉండనీయం లేదు. రాష్ట్రాన్ని స్కామ్ ఆంధ్రప్రదేశ్‌గా చంద్రబాబు మార్చేశారు. నేను వస్తున్నానని తెలిసి ఈ రోజు తాత్కాలికంగా పనిని ఆపేశారు. రోజు వందల లారీలతో ఇసుక, మట్టిని అక్రమంగా తరలించేస్తున్నారు. చంద్రబాబు హయాంలో ప్రజలకే కాదు దేవుళ్లకు సైతం రక్షణ లేకుండా పోయిందంటూ' జగన్ మండిపడ్డారు.

click me!