జగన్ వైపు చూస్తున్న మరొక కమ్మ నేత (వీడియో)

First Published Apr 23, 2018, 3:01 PM IST
Highlights

జగన్ వైపు చూస్తున్న మరొక కమ్మ నేత  (వీడియో)

చాలా మంది కమ్మనాయకులకు  చంద్రబాబు నాయుడు విధానాలు పోకడలు నచ్చడం లేదు. అందుకే వారంతా జగన్ నాయకత్వంలోని వైసిసి చూస్తున్నారు. ఆ మధ్య మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి టిడిపి అవమానాలు భరించ లేక పోతున్నా నంటూ  వైసిపిలో చేరారు. అంతేకాదు, తర్వాత గుంటూరు జిల్లాలోని నారా కోడూరులో చాలా మంది కమ్మ ప్రముఖులు వైసిసిలో చేరారు.టిడిపికి పెట్టని కోటయిన నారాకోడూరు నుంచి వైసిపిలో చేరడం ఏమిటని కొంతమందికి కోపమొచ్చింది. జగన్ పాదయాత్ర చేసి పోయాక పసుపు నీళ్లతో వూర్లోని రోడ్ల న్నంటిని కడిగి కసి తీర్చుకున్నారు.  ఇపుడు మరొక కమ్మ ప్రముఖుడు వైసిసిలో చేరుతున్నారు. ఆయనెవరో కాదు,  ఒకనాటి టిడిపి మంత్రి, మంచి గౌరవ ప్రతిష్టలున్న వసంత నాగేశ్వరావు కుమారుడు కృష్ణ ప్రసాద్. వసంత కృష్ణప్రసాద్‌ కృష్ణా జిల్లా నందిగామ మండలం ఐతవరం గ్రామానికి చెందిన నాయకుడు.ఆయన టిడిపికి గుడ్ బై చెప్పనున్నట్లు వార్తలు రాగానే మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుతో చంద్రబాబే రాయబారం పంపారు.వచ్చే ఎన్నికల్లో గుంటూరు జిల్లాలో నుంచి పోటీచేయిస్తామని కూడా హామీ ఇచ్చారు.అయితే, ఆయన టిడిపిలో ఉండేందుకు సుముఖంగా లేరని తెలిసింది. అయితే ఆయనకు వై ఎస్ కుటుంబంతో బాగా సంబంధాలున్నాయి. ఇపుడు తాజాగా ఆయననుజగన్ ను కూడా కలిశారు. మైలవరం నుంచి పోటీచేయించేందుకు జగన్ హామీ ఇచ్చినట్లు కూడా చెబుతున్నారు.దీనికి కృష్ణ ప్రసాద్ అంగీకరించినట్లు కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.వారం రోజుల్లో మంచి రోజు చూసుకుని జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరతారని రాజధాని రాజకీయవర్గాల్లో బాగా వినబడుతూ ఉంది.

 

tags
click me!