జగనన్నే మన భవిష్యత్తు: ఈ నెల 11న ప్రారంభించనున్న వైసీపీ

Published : Feb 07, 2023, 05:02 PM IST
జగనన్నే మన భవిష్యత్తు: ఈ నెల  11న  ప్రారంభించనున్న వైసీపీ

సారాంశం

జగనన్నే మన భవిష్యత్తు  పేరుతో  కొత్త కార్యక్రమానికి  వైసీపీ  నాయకత్వం కొత్త కార్యక్రమాన్ని  ఈ నెల  11న ప్రారంభించనుంది. పార్టీని క్షేత్రస్థాయి నుండి బలోపేతం చేయడమేఈ కార్యక్రమం ఉద్దేశ్యం.

అమరావతి:  జగనన్నే మన భవిష్యత్తు  పేరుతో   వైసీపీ  కార్యక్రమానికి   ప్లాన్  చేస్తుంది.  ఈ నెల  11వ తేదీన  ఈ కార్యక్రమం ప్రారంభించనుంది   వైసీపీ  నాయకత్వం.   క్షేత్రస్థాయిలో  పార్టీని బలోపేతం  చేసేందుకు  ఈ కార్యక్రమానికి  రూపకల్పన చేశారు. క్షేత్రస్థాయిలో  పార్టీ బలంగా  లేకపోతే  పార్టీకి నష్టమని  నాయకత్వం  భావిస్తుంది.  గ్రామస్థాయి నుండి పార్టీని  బలోపేతం చేయాలనే లక్ష్యంగా  ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.   తమ ప్రభుత్వం చేపట్టిన  కార్యక్రమాలను  మరింతగా  ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు  అనేక కార్యక్రమాలను   ఆ పార్టీ నాయకత్వం తీసుకుంటుంది.  

2024లో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి.  దీంతో  ఈ ఎన్నికల్లో  విజయం సాధించాలని జగన్  పట్టుదలగా  ఉన్నారు. గత ఎన్నికల్లో  వైసీపీ  151 ఎమ్మెల్యే స్థానాలను దక్కించుకుంది.  కానీ  వచ్చే ఎన్నికల్లో  175  అసెంబ్లీ స్థానాలను దక్కించుకోవాలని  ఆ పార్టీ వ్యూహరచనతో  ముందుకు వెళ్తుంది.  గ్రామస్థాయి నుండి పార్టీని  బలోపేతం  చేసేందుకు పార్టీ నాయకత్వం  చర్యలు చేపట్టింది.ఈ క్రమంలోనే  ఇటీవల నే గృహ సారధులు , పార్టీ కన్వీనర్ల  నియామకాన్ని చేశారు. 

వచ్చేఎన్నికల్లో  టీడీపీని  అధికారంలోకి రాకుండా అడ్డుకొంటే  ఆ పార్టీ మనుగడ కష్టమనే అభిప్రాయంతో  వైసీపీ  ఉంది. అందుకే  ఈ దఫా  ఎలాగైనా టీడీపీని  అడ్డుకొనేందుకు వ్యూహంతో  ముందుకు వెళ్తుంది.  టీడీపీకి గట్టి పట్టున్న నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి పాలైంది.  అయితే ఆ ఎన్నికల సమయంలో  ఉన్న ప్రభావంతో టీడీపీ అభ్యర్ధులు ఓటమి పాలయ్యారు. అయితే   ఈ దఫా  మాత్రం  తమ ప్రభుత్వం చేసిన  పనులపై  ప్రజల అభిప్రాయాన్ని  కోరనున్నారు జగన్

ఆయా గ్రామాలు, పట్టణాల్లో 50 కుటుంబాలకు  ఇద్దరు గృహ సారధులను నియమిస్తారు . ఇందులో  ఒకరు మహిళ తప్పనిసరిగా  ఉంటారు. ప్రతి సచివాలయానికి  ముగ్గురు పార్టీ కన్వీనర్లను  నియమించారు.  రాష్ట్ర వ్యాప్తంగా  6.2 లక్షల మంది  గృహ సారధులు,  45 వేల మంది  పార్టీ కన్వీనర్ల  నియామాకం పూర్తి  చేశారు. 

 రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న  సంక్షేమ పథకాలు  ఎలా అమలు  అవుతున్నాయనే విషయమై  ప్రజల నుండి తెలుసుకునేందుకు ప్రజల వద్దకు వెళ్లాలని జగన్ ఆదేశించారు.ఈ కార్యక్రమంపై  ప్రజా ప్రతినిధులు ఎలా పాల్గొంటున్నారనే విషయమై కూడా  జగన్  ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. వచ్చే మాసంలో ఈ అంశంపై మరోసారి  పార్టీ ప్రజా ప్రతినిధులతో  జగన్  వర్క్ షాప్  నిర్వహించనున్నారు. 

PREV
click me!

Recommended Stories

Roja vs Kirrak RP: నీ పిల్లల ముందు ఇలాంటి మాటలు అనగలవా? రోజాకు గట్టిగా ఇచ్చేసిన కిర్రాక్ ఆర్పి
YS Jagan Massive Rally & Governor Meet: అభిమానులు పెద్ద సంఖ్యలో మద్దతు | YSRCP | Asianet News Telugu