టీడీపీ కుల పార్టీ:వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

Published : Apr 15, 2022, 04:33 PM ISTUpdated : Apr 15, 2022, 04:56 PM IST
టీడీపీ కుల పార్టీ:వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

సారాంశం

టీడీపీ ఒక కుల పార్టీ అని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శించారు. శుక్రవారం నాడు ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడారు.తిరుపతిలో రేపు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టుగా చెప్పారు.

తిరుపతి:TDP  ఒక కుల పార్టీ అని YCP ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. శుక్రవారం నాడు తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు.తిరుపతిలో రేపు జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్టుగా ఆయన చెప్పారు.ఉద్యోగ కల్పనలో ఏపీ ప్రభుత్వం ముందుందన్నారు. 

ఈ జాబ్‌మేళాలో పాల్గొనేందుకు ఒకటిన్నర లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఎంపీ Vijayasai Reddy చెప్పారు. ఏపీ సీఎం YS Jagan మూడేళ్ల కాలంలో 30కి పైగా సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేసినట్టుగా చెప్పారు.  బడుగు, బలహీన వర్గాలకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ప్రతి ఒక్కరికి లబ్ది చేకూరాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.కుల మతాలకు అతీతంగా తమ ప్రభుత్వం అవకాశాలు కల్పిస్తున్నట్టుగా విజయసాయిరెడ్డి వివరించారు.

సుదీర్ఘ కాలం సీఎంగా పనిచేసిన Chandrababu Naidu ఏ ఒక్క పధకాన్నైనా ప్రజల కోసం తీసుకొచ్చారా అని ప్రశ్నించారు.  చంద్రబాబు పాలనలో ప్రజలను బెదిరించడం, పీడించడం తప్ప ఏమైనా మంచి చేశారా అని ఆయన అడిగారు. ప్రెస్ మీట్లు పెట్టి తమ పార్టీపై చంద్రబాబు నాయుడు ఆ పార్టీ నేతలు పిచ్చి వాగుడు వాగుతున్నారని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. లోకేష్ ని నమ్ముకుని చంద్రబాబునాయుడు 2024 ఎన్నికలకు వెళ్లగలడా అని ప్రశ్నించాడు. జనసేనతో పొత్తుకోసం చంద్రబాబు తాపత్రయపడుతున్నారని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!