
కాకినాడ జిల్లాలో (kakinada district) ఓ పుణ్య కార్యంలో అపశృతి చోటు చేసుకుంది. తాళ్లరేవు మండలం నీలపల్లి గ్రామంలో మీనాక్షీ సమేత శ్రీ నీలకంఠేశ్వరుని (neelkantheshwara swamy temple) ఆలయ పున: ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. అయితే స్వామి వారి పున: ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతుండగా ధ్వజస్తంభాన్ని నిలబెడుతూ వున్నారు. అయితే ధ్వజస్తంభానికి ఓ వైపు కట్టి వున్న తాడు తెగిపోయింది. దీంతో స్తంభం ఒరిగిపోయి భక్తులపై పడింది. ఈ ఘటనలో పలువురు గాయపడటంతో వారిని హుటాహుటిన యానాం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.