సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి: చంద్రబాబుకు విజయసాయిరెడ్డి పుట్టిన రోజు శుభాకాంక్షలు

Published : Apr 20, 2023, 10:49 AM IST
 సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి: చంద్రబాబుకు విజయసాయిరెడ్డి  పుట్టిన రోజు శుభాకాంక్షలు

సారాంశం

చంద్రబాబుకు  వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి   పుట్టిన  రోజు  శుభాకాంక్షలు  చెప్పారు. ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి  శుభాకాంక్షలు  చెప్పారు.

అమరావతి: టీడీపీ చీఫ్ చంద్రబాబుకు  వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి  పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.  ట్విట్టర్ వేదికగా  వైసీపీ ఎంపీ ఈ విషయమై ట్వీట్  చేశారు.  చంద్రబాబు  సంపూర్ణ ఆయురారోగ్యాలతో  ఉండాలని  విజయసాయిరెడ్డి  ఆకాంక్షించారు.  

అవకాశం దొరికితే  చంద్రబాబుపై  విరుచుకుపడే  విజయసాయిరెడ్డి  పుట్టిన రోజు  శుభాకాంక్షలు చెప్పడం  ప్రస్తుతం చర్చకు దారితీసింది. చంద్రబాబుకు  విజయసాయిరెడ్డి  పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడం  ఇదే ప్రథమంగా  చెబుతున్నారు. వైఎస్ జగన్ , చంద్రబాబులు  పరస్పరం పుట్టినరోజు సందర్భంగా  గ్రీటింగ్స్  చెప్పుకొంటార.

 

సినీ నటుడు నందమూరి తారకరత్న  మృతి చెందిన  సమయంలో    చంద్రబాబు,  విజయసాయిరెడ్డి  కొద్దిసేపు మాట్లాడుకున్నారు. చంద్రబాబు  మీడియాతో మాట్లాడే సమయంలో  విజయసాయిరెడ్డి  దగ్గరే ఉన్నారు.  విజయసాయిరెడ్డికి  చెప్పి చంద్రబాబు అక్కడి నుండి  వెళ్లారు.  చంద్రబాబు వెళ్లే  వరకు  విజయసాయిరెడ్డి  అక్కడే  ఉన్నారు.నందమూరి తారకరత్న  భార్య  విజయసాయిరెడ్డికి సమీప బంధువు. 

నందమూరి తారకరత్న  బెంగుళూరులోని  ఆసుపత్రి లో  చికిత్స పొందుతున్న సమయంలో  విజయసాయిరెడ్డి  తారకరత్నను  పరామర్శించారు. మరో వైపు  విజయసాయిరెడ్డికి బాలకృష్ణ ఫోన్ చేసి  నందమూరి తారకరత్న  ఆరోగ్య  పరిస్థితి గురించి  ఆరా తీశారు. 

PREV
click me!

Recommended Stories

Vegetables Price : వీకెండ్ మార్కెట్స్ లో ఏ కూరగాయ ధర ఎంత..?
IMD Rain Alert : ఈ రెండ్రోజులు వర్ష బీభత్సమే... ఈ ప్రాంతాలకు పొంచివున్న ప్రమాదం